చిరంజీవి….రియల్ మెగాస్టార్!

78
rajamouli
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసల జల్లు కురిపించారు దర్శకుడు రాజమౌళి. చిరంజీవి నిజంగానే మెగాస్టార్ అని కొనియాడారు. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా కర్ణాటకలోని చిక్బల్లాపూర్ లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకి ఆర్ఆర్ఆర్ టీమ్ తో పాటు కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన ప్రముఖులు, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈసందర్భంగా మాట్లాడిన రాజమౌళి…. టికెట్ల ధరలను పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చిన రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఇందుకోసం కృషి చేసిన మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు.

టికెట్ల ధరల పెంపుకు చిరంజీవి ఎంతో కృషి చేశారని..ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా సినిమా కోసం ప్రయత్నించారని చెప్పారు. ఎవరు అవునన్నా.. ఎవరు కాదన్నా.. చిరంజీవి మెగాస్టార్ అంటూ రాజమౌళి ప్రశంసించారు.

- Advertisement -