చిరు బర్త్ డే..చీఫ్ గెస్ట్ గా పవన్

401
Pawan Kalyan Chiranjeevi
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజును ఈసారి గ్రాండ్ గా సెలబ్రెట్ చేయనున్నారు. ప్రతి ఏడాది చిరంజీవి పుట్టిన రోజున ఏదొ ఒక కార్యక్రమం నిర్వహిస్తూనే ఉంటారు. ఈసారి కూడా చిరంజీవి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే. చిరు పుట్టిన రోజు వేడుకలను హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో నిర్వహించనున్నారు. ఈవేడుకకు ఫిలిం ఇండస్ట్రీలోని పలువురు పెద్దలతో పాటు మెగా హీరోలు హాజరుకానున్నారు.

Chiranjeevi Pawan Kalyan

ప్రతి ఏడాది మెగా హీరోలందరు కలిసి చేసుకునే ఈపార్టీలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు హాజరుకాలేదు. అయితే ఈసారి చిరు బర్త్ డే వేడుకలకు పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నట్లు సమాచారం. ఎప్పుడు అడిగినా ఏదో ఓ కారణం చెప్పే పవన్ ఈ సారి మాత్రం అన్నయ్య బర్త్ డే వేడుకల్లో కనిపించబోతున్నాడు.

ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు స్వామి నాయుడు కన్ఫర్మ్ చేసాడు. చిరు 60వ బర్త్ డే వేడుకల్లో నాగబాబు పవన్ కళ్యాణ్ విషయంపై అభిమానులతో చాలా సీరియస్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ మాత్రం పక్కాగా వస్తాడని చెబుతున్నారు మెగా కాంపౌండ్ వర్గాలు.

- Advertisement -