యంగ్ హీరో రానా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న బహుభాషా చిత్రం ఘాజీ. 1971లో జరిగిన భారత్, పాక్ యుద్ధంలో వైజాగ్ తీరంలో అదృశ్యమైన పాక్ సబ్ మెరైన్ కథతో ఈ చిత్రాన్ని రూపోందిస్తున్నారు. భారతీయ చలనచిత్ర చరిత్రలో తొలిసారిగా ఓ సబ్ మెరైన్ స్టోరీతో రాబోతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, తమిళ్ హీరో సూర్య కూడా పాలు పంచుకోబోతున్నారు. కథను నారేట్ చేసేందుకు తెలుగు వర్షన్ కు చిరు, తమిళ వర్షన్కు సూర్య తన గాత్రాన్ని విపిపించబోతున్నారు.
యుద్ద నేఫథ్యంలో.. గొప్ప ప్రయోగాత్మకమైకంగా రాబోతున్న ఈసినిమాను ఫిబ్రవరి 17న రిలీజ్ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. అయితే సినిమాకు అదనపు ఆకర్షన తీసుకువచ్చేందుకు తెలుగు తమిళ హిందీ భాషల్లో కీలక సన్నివేశాల్లో కథను స్టార్ హీరోలు నారేట్ చేయనున్నారు. ఇప్పటికే హిందీ వర్షన్కు అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ అందించగా తెలుగు వర్షన్కు మెగాస్టార్ చిరంజీవి, తమిళ వర్షన్కు సూర్య డబ్బింగ్ చెపుతున్నారు.
కొత్త దర్శకుడు సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను పీవీపీ సినిమాస్ భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తోంది. బాలీవుడ్లో కరణ్ జోహార్ ఘాజీ సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రాంభించిన చిత్రయూనిట్ సక్సెస్ పై ధీమాగా ఉన్నారు. రానాతో పాటు కెకె మీనన్, అతుల్ కులకర్ణి, ఓం పురి, తాప్సీలు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను