కాటమరాయుడు సెట్స్‌లో శృతి బర్త్ డే

204
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘కాటమరాయుడు. గబ్బర్ సింగ్ తో సూపర్ హిట్ ఫెయిర్‌గా నిలిచిన ఈజోడి మరోసారి కాటమరాయుడు తో సందడి చేయనుంది. నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం పై నిర్మాత శరత్ మరార్ నిర్మిస్తున్న ఈసినిమాకు కిషోర్ పార్ధసాని డాలీ దర్శకత్వం అందిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.తమిళంలో విజయం సాధించిన ‘వీరమ్‌’ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Shruti Haasan Birthday Celebrations on Katamarayudu Sets

ఇక ఈ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్న శృతిహాసన్‌ శనివారం పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది. చిత్ర యూనిట్ సమక్షంలో శృతి కేక్ కట్ చేసింది. ఈ మేరకు సెట్‌లో దిగిన కొన్ని ఫొటోలను నటుడు శివబాలాజి తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

కాటమరాయుడు సినిమాలో నటిస్తున్న శివబాలాజీ పుట్టినరోజు వేడుకలను కూడా చిత్ర బృందం ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా శివబాలాజీ తన ఫేస్ బుక్‌లో పవన్‌తో కలిసి కేక్ కట్ చేసిన ఫోటోను షేర్ చేశారు. అప్పట్లో ఈ ఫోటో తెగవైరలైంది. తాజాగా శృతి బర్త్ డే కూడా ఘనంగా నిర్వహించారు.

- Advertisement -