చైనా ఉచ్చులో.. 82దేశాలు విలవిల

1631
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో 82దేశాలు చైనా విదేశాంగ విధానంతో అధికంగా ప్రభావానికి గురవుతున్నాయని రేడియో లిబర్టీ/రేడియో ఫ్రీ యూరోప్ సంస్థ ప్రకటించింది. తైవాన్ కేంద్రంగా పనిచేస్తున్నడబుల్‌ థింక్ ల్యాబ్‌ పరిశోధనలో ఈ విషయాలు వెల్లడించారు. చైనా విదేశాంగ విధానం దేశీయ పాలసీలు సాంకేతికత వంటి ఆంశాల్లో చైనా ప్రభావం ఆయా దేశాలపై ఉంటుందని పేర్కొన్నారు. ఈ జాబితాలో మొదటి స్థానంలో పాకిస్థాన్ ఉండగా రెండవ స్థానాల్లో కంబోడియా, సింగపూర్ దేశాలు ఉన్నాయని తెలిపింది. మూడవ స్థానంలో థాయిలాండ్ కాగా దక్షిణాఫ్రికా, పెరూ, ఫిలిప్పీన్స్‌, కిర్గిస్థాన్‌, తజకిస్థాన్‌, మలేషియా వరుసగా కొనసాగుతున్నాయని నివేదికల్లో వెల్లడించింది.

అభివృద్ది చెందిన దేశాల్లో కూడా ఈ ప్రభావం ఉందని తెలిపింది. యూరోప్‌లోని జర్మనీ దేశం 19వ స్థానంలో ఉందని, అమెరికా 21వ స్థానంలో ఉందని వెల్లడించింది. విదేశాంగ విధానం, ఉన్నత విద్య, రాజకీయాలు, ఆర్థిక బంధం, మిలిటరీ సహకారం, మీడియా, సాంకేతిక, సాంస్కృతిక సంబంధాలు వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులు ప్రకటించామని నివేదికలో పేర్కొన్నారు. చైనా ప్రవేశపెట్టిన బెల్ట్‌ ఆండ్ రోడ్‌ ఇనిషియేటివ్ ప్రోగ్రాంలో భాగంగా ఆయా దేశాలు ప్రభావితమవుతున్నాయని ఈ నివేదికలో వెల్లడించారు. పాకిస్థాన్ లోని ప్రతి రంగంలో చైనా ప్రభావం ఉందని తెలిపారు. ప్రత్యేకంగా మిలటరీ, సాకేంతికత, విదేశాంగ విధానంలో ఆ ప్రభావం ఉందని చెప్పారు.

ఇవి కూడా చదవండి…

సింహంను పిల్లిలాగా పట్టుకున్న వీరనారి

జోడో యాత్రలో ప్రియాంక కూతురు

క్యూ ఆర్ కోడ్ పేమెంట్స్ తో జాగ్రత్త !

- Advertisement -