పంజాబ్‌పై చెన్నై విజయం..

251
- Advertisement -

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ అద్భుతాలేమీ చేయలేదు. ప్లేఆఫ్స్‌ చేరాలంటే భారీ తేడాతో గెలవాల్సిన ఆ జట్టు.. 5 వికెట్ల తేడాతో చెన్నై చేతిలో మట్టికరించింది. స్లో వికెట్‌పై ఇరుజట్ల బౌలర్లు ఆధిపత్యం చూపించిన వేళ, చెన్నై సూపర్ కింగ్స్‌నే విజయం వరించింది. చివరిదాకా పోరాడి గెలువడంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంతోనే సరిపె ట్టుకుంది. చెన్నై బౌలర్లు లుంగీ (4/10), ఠాకూర్ (2/33), బ్రావో (2/39) సత్తా చాటడంతో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్, 19.4 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌట్ అయింది. కరుణ్ నాయర్ (26 బంతుల్లో 54; 3ఫోర్లు, 5 సిక్స్‌లు) ఒక్కడే ఆకట్టుకున్నాడు. 154 పరుగుల టార్గెట్‌ను చెన్నై 5 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో ఛేదించింది. రైనా (48 బంతుల్లో 61 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), చాహర్ (20 బంతుల్లో 39; ఒక ఫోర్, 3 సిక్స్‌లు) విజయంలో కీలకపాత్ర పోషించారు. చెన్నై బౌలర్ ఎంగ్డీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది.

Chennai Super Kings beat Kings XI Punjab by 5 wickets

పంజాబ్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (బి) ఎంగిడి 7; గేల్‌ (సి) ధోని (బి) ఎంగిడి 0; ఫించ్‌ (సి) రైనా (బి) చాహర్‌ 4; మనోజ్‌ తివారి (సి) ధోని (బి) జడేజా 35; మిల్లర్‌ (బి) బ్రావో 24; కరుణ్‌ (సి) చాహర్‌ (బి) బ్రావో 54; అక్షర్‌ (సి) బిల్లింగ్స్‌ (బి) శార్దూల్‌ 14; అశ్విన్‌ (సి) ధోని (బి) ఎంగిడి 0; టై (సి) రైనా (బి) ఎంగిడి 0; మోహిత్‌ నాటౌట్‌ 2; అంకిత్‌ (సి) డుప్లెసిస్‌ (బి) శార్దూల్‌ 2; ఎక్స్‌ట్రాలు 11 మొత్తం: (19.4 ఓవర్లలో ఆలౌట్‌) 153; వికెట్ల పతనం: 1-7, 2-14, 3-16, 4-76, 5-80, 6-116, 7-132, 8-132, 9-150; బౌలింగ్‌: చాహర్‌ 4-0-30-1; ఎంగిడి 4-1-10-4; హర్భజన్‌ 1-0-13-0; శార్దూల్‌ 3.4-0-33-2; డ్వేన్‌ బ్రావో 4-0-39-2; జడేజా 3-0-23-1

చెన్నై ఇన్నింగ్స్‌: రాయుడు (సి) రాహుల్‌ (బి) మోహిత్‌ 1; డుప్లెసిస్‌ (సి) గేల్‌ (బి) రాజ్‌పుత్‌ 14; రైనా నాటౌట్‌ 61; బిల్లింగ్స్‌ (బి) రాజ్‌పుత్‌ 0; హర్భజన్‌ ఎల్బీ (బి) అశ్విన్‌ 19; దీపక్‌ చాహర్‌ (సి) మోహిత్‌ (బి) అశ్విన్‌ 39; ధోని నాటౌట్‌ 16; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం: (19.1 ఓవర్లలో 5 వికెట్లకు) 159; వికెట్ల పతనం: 1-3, 2-27, 3-27, 4-58, 5-114; బౌలింగ్‌: రాజ్‌పుత్‌ 4-1-19-2; మోహిత్‌శర్మ 3.1-0-28-1; ఆండ్రూ టై 4-0-47-0; అక్షర్‌ పటేల్‌ 4-0-28-0; అశ్విన్‌ 4-0-36-2.

- Advertisement -