చెన్నై సూపర్ విక్టరీ…

139
chennai

ఐపీఎల్ 2020లో రెండో విజయాన్ని నమోదు చేసింది చెన్నై సూపర్ కింగ్స్‌. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. కింగ్స్‌ విధించిన 179 పరుగుల లక్ష్యాన్ని 17.4 ఓవర్లలో వికెట్ కొల్పోకుండా చేధించింది.

ఓపెనర్లు వాట్సన్‌ (53 బంతుల్లో 83 నాటౌట్‌; 11 ఫోర్లు, 3 సిక్సర్లు), డుప్లెసిస్‌ (53 బంతుల్లో 87 నాటౌట్‌; 11 ఫోర్లు, 1 సిక్స్‌)తో రాణించడంతో వికెట్ పడకుండానే గెలుపు సొంతం చేసుకుంది.

అంతకముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు చేసింది. కెప్టెన్‌ లోకేశ్‌ రాహుల్‌ (52 బంతుల్లో 63; 7 ఫోర్లు, 1 సిక్స్‌) స్కోరుబోర్డును నడిపించగా… పూరన్‌ (17 బంతుల్లో 33; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మెరిపించాడు. శార్దుల్‌ ఠాకూర్‌ 2 వికెట్లు తీశాడు.

లీగ్‌లో ఇప్పటిదాకా 5 మ్యాచ్‌లాడిన పంజాబ్‌కు ఇది నాలుగో ఓటమి కాగా… సూపర్‌కింగ్స్‌ తమ ‘హ్యాట్రిక్‌’ పరాజయాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టి రెండో విజయాన్ని నమోదు చేసింది.