డ్రగ్స్ వాడినట్టు ఛార్మీ ఒప్పుకున్నట్టేనా..?

227
Charmee for high court
Charmee for high court
- Advertisement -

డ్రగ్స్ వ్యవహారంలో ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ సిట్ పంపించిన నోటీసులపై హీరోయిన్ ఛార్మి హైకోర్టును ఆశ్రయించింది. ఈ ఉదయం ఆమె లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. సిట్ విచారణ తీరు సరిగా లేదంటూ ఛార్మి ఆరోపించింది. తనకు డ్రగ్స్ వాడే అలవాటు లేకున్నప్పటికీ, నోటీసులు జారీ చేశారని… ఇది ఎంతవరకు సబబని ప్రశ్నించింది. సిట్ వ్యవహారం తన పరువుకు భంగం కలిగించేలా ఉందని చెప్పింది. ఆర్టికల్ 20 సబ్ క్లాజ్ 3 ప్రకారం బలవంతంగా తన నుంచి బ్లడ్ శాంపిల్స్ ను సేకరించవద్దంటూ పిటిషన్ లో కోరింది. రక్త నమూనాల సేకరణ సరికాదని పిటిషన్ లో తెలిపింది. సిట్ విచారణకు తనతో పాటు లాయర్ ను కూడా తీసుకెళ్లేందుకు వెసులుబాటు కల్పించాలని పిటిషన్ లో ఆమె కోర్టును కోరింది. ఈ మధ్యాహ్నం తర్వాత ఈ పిటిషన్ విచారణకు రాబోతోంది.

ఈ నెల 26వ తేదీన సిట్ విచారణను ఎదుర్కోబోతున్న ఛార్మీ నిజంగానే డ్రగ్స్ సేవించిందా? ఆ విషయాన్ని ఒప్పుకున్నట్టేనా? అందుకే విచారణ నుంచి తప్పించుకోవడానికి రిట్ వేసిందా? ఛార్మి అందుకే తొందరపడిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, మూడు నెలల కాలంలో డ్రగ్స్ తీసుకుంటే, దాని ఆనవాళ్లు వెంట్రుకలు, గోళ్లలో మినహా మరెక్కడా తెలియవు. అందుకే సినీ ప్రముఖులు డ్రగ్స్ తీసుకున్నారా? లేదా? అన్న విషయాన్ని నిర్దారించేందుకు సిట్ వారి రక్త నమూనాలు సేకరిస్తోంది. ఒకవేళ చార్మీ ఈ మూడు నెలల్లోగా డ్రగ్స్ వాడివుంటే ఆ విషయం బయటకు వస్తుంది కాబట్టి.. తాను రక్తాన్ని, గోళ్లు, వెంట్రుకల నమూనాలను ఇవ్వలేనని ఛార్మీ కోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తోంది.. ఇక డ్ర‌గ్స్‌తో కానీ, కెల్విన్‌తో కానీ ఛార్మికి ఎటువంటి సంబంధాలు లేవ‌ని చార్మీ డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు పూరి జగన్నాధ్ ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.. ఇప్పుడు ఛార్మీతో రిట్ వేయించింది కూడా పూరీ జగన్నాదేనని అనుమానం వ్యక్తం అవుతోంది. ఈ కేసు  కోర్టు ఏం చెబుతుందన్న విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొని వుంది.

- Advertisement -