వాలంటీర్లకు రూ.10వేలు..చంద్రబాబు స్ట్రాటజీ!

19
- Advertisement -

ప్రస్తుతం ఏపీలో వాలెంటరీ వ్యవస్థపై తీవ్రమైన రాజకీయం నడుస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ ప్రభుత్వానికి ప్రజలకు వారధిలా పని చేస్తూ దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఏపీ ప్రజల్లో కూడా వాలెంటరీ వ్యవస్థపై మంచి సానుకూలత ఉంది. అయితే ఈ వ్యవస్థకు చట్టబద్దత లేని కారణంగా శాశ్వతంగా కొనసాగిస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా ఉంటూ వచ్చింది. ఈ వ్యవస్థను జగన్ తన రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నారనే విమర్శలు కూడా గట్టిగానే వినిపించాయి. దాంతో ఎన్నికల కార్యకలాపాలలో వాలంటీర్లు పాల్గొనరాదని ఇటీవల ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఒక్కసారిగా వాలెంటరీ వ్యవస్థ హోల్డ్ లో పడిపోయింది. అయితే ఈ వ్యవస్థకు చంద్రబాబు వ్యతిరేకమని, ఈ వ్యవస్థను రద్దు చేసేందుకే ఆయన ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేతలు చెబుతూ వస్తున్నారు. .

వాలెంటరీ వ్యవస్థ తిరిగి కొనసాగలంటే మళ్ళీ జగన్ అధికారంలోకి రావాలని నొక్కి చెబుతూ వచ్చారు. దాంతో వాలెంటిర్లలో చంద్రబాబుపై కొంత వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో వాలెంటిర్ల ఓటు బ్యాంకును టీడీపీ వైపు తిప్పుకునేందుకు చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వాలెంటిర్లకు వైసీపీ ప్రభుత్వం రూ.5 వేల జీతం ఇస్తుండగా.. తాము అధికారంలోకి వస్తే వాలెంటిర్ల జీతం రూ.10 వేలకు పెంచుతామని చంద్రబాబు స్పష్టం చేశారు.

అంతే కాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ వాలెంటిర్లను తొలగించబోమని క్లారిటీ ఇచ్చారు. కాగా జగన్ కూడా ఈసారి వాలెంటిర్లకు రూ.10 పెంచే దిశగా అడుగులు వేస్తారని గత కొన్నాళ్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ జగన్ ఎలాంటి ప్రకటన చేయకముందే చంద్రబాబు వాలెంటిర్లకు రూ.10 వేలు ప్రకటించడంతో వారి ఓటు బ్యాంకు ఇప్పుడు ఎటువైపు మల్లుతుందనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి వాలెంటిర్ల ఓట్లు కొల్లగొట్టేందుకు చంద్రబాబు వేసిన స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Also Read:ఆది సాయికుమార్..ష‌ణ్ముఖ

- Advertisement -