భార్యను ఇలా కూడా ఏడిపిస్తారా..?

220
lawyer husband
- Advertisement -

ఓ భర్త తన భార్యను ఇబ్బంది పెట్టడానికి కొత్త పద్దతి ఎంచుకుని.. భార్యకు షాక్ ఇచ్చాడు. భార్యకు భరణంగా చిల్లర ఇచ్చి.. ఏడిపించాడు ఓ లాయర్ భర్త.. ఈ ఘటన చంఢీగడ్ రాష్ట్రంలో జరగింది. 2014లో ఈ ఇద్దరు విడిపోయి విడాకులు తీసుకున్నారు. అయితే భార్య ఖర్చుల నిమిత్తం భర్త నెలకు రూ.25 వేల భరణం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అప్పటి నుంచి ప్రతినెల భార్యకు భరణంగా రూ.25 వేలు ఇస్తూ వస్తున్నాడు. గత రెండు నెలలుగా తన భర్త తనకు భరణం ఇవ్వడం లేదని కోర్టు ను ఆశ్రయించింది భార్య. చివరగా కోర్టు ఆదేశాల మేరకు డబ్బులు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు లాయర్ భర్త.

Chandigarh lawyer gives wife Rs 25,000 maintenance in coins

కోర్టులోనే భార్యకు డబ్బులు ఉన్న బ్యాగ్ ఇచ్చాడు. ఆ బ్యాగ్ తీసుకున్న భార్య ఒక్కసారిగా షాక్ గురైంది. బ్యాగ్ నిండా చిల్లరే అవి రూ.1, రూ.2 కాయిన్లు మాత్రమే ఉన్నాయి. మొత్తం రూ.24,600 చిల్లర ఉంది. మిగతా నాలుగు వందలు, నోట్లుగా ఇచ్చాడు. ఈ చిల్లర బ్యాగ్ తీసుకున్న భార్య కోర్టులోనే బోరుమని విలపించింది. తన భర్త తనను ఇబ్బంది పెట్టడానికి చిల్లర డబ్బులు తీసుకువచ్చాడని కన్నీళ్లు పెట్టుకుంది.

ఆ లాయర్ భర్త మాత్రం.. తాను చేసిన పనిని సమర్థించుకున్నాడు. భరణం డబ్బులు చిల్లరగా ఇవ్వకూడదని ఏ చట్టంలో లేదని భార్త వాదించాడు. డబ్బులను లెక్కపెట్టాలంటూ న్యాయమూర్తి ఆదేశించి, ఈ కేసును ఈ నెల 27కు వాయిదా వేసింది.

- Advertisement -