వీడియోకాన్ గ్రూప్‌కు 3,250 కోట్ల రుణాలివ్వడం ద్వారా ఐసీఐసీఐ ఎండీ,సీఈవోచందా కొచ్చర్, ఆమె కుటుంబ సభ్యులు లబ్ధి పొందారన్న(క్విడ్ ప్రో కో) ఆరోపణలు రావడంతో బ్యాంకింగ్ రంగంలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కొచ్చర్‌పై సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ ఆధ్వర్యంలోని స్వత్రంత కమిటీ విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే.
విచారణ జరుగుతుండగానే ఇవాళ బ్యాంకు ఎండీ, సీఈవో పదవికి ఆమె రాజీనామా చేశారు. ఇందుకు ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు కూడా అంగీకారం తెలిపింది. ఈ విషయాన్ని బ్యాంకు అధికారులు గురువారం రెగ్యులేటరీ ఫైలింగ్ ద్వారా బీఎస్‌ఈకి తెలియజేశారు.
ఆమె స్థానంలో తాత్కాలిక సీఈవోగా ఉన్న సందీప్ బక్షిని ఎండీ, పూర్తి స్థాయి సీఈవోగా నియమిస్తున్నట్లు ఐసీఐసీఐ బోర్డు ప్రకటించింది. సందీప్ బక్షి 1986లో ఐసీఐసీఐ బ్యాంకులో చేరారు. 2010 నుంచి ఆగస్టు నుంచి ప్రుడెన్షియల్ లైఫ్‌కు సీఈవోగా పనిచేస్తున్నారు. దీంతో పాటు ఐసీఐసీఐ బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు.
ఆరోపణల నేపథ్యంలో ఆమె నిరవధిక సెలవు పెట్టారు. అంతలోనే ఐసీఐసీఐ సీఈవో పదవికి రాజీనామా చేశారు చందా కొచ్చర్.