చందా కొచ్చర్‌కు షాకిచ్చిన సీబీఐ

215
chanda kochhar
- Advertisement -

ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈవో చందా కొచ్చర్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. క్విడ్‌ ప్రో కోకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆమెపై  విచారణ జరుగుతుండగా కొచ్చార్ దేశం విడిచి వెళ్లొచ్చనే అనుమానంతో ఎయిర్‌పోర్ట్ ఇమిగ్రేషన్ అధికారులను అప్రమత్తం చేసింది సీబీఐ. కొచ్చర్‌పై లుక్‌ఔట్ నోటీసును జారీ చేసింది. ఆమె దేశం విడిచి వెళ్లడానికి ప్రయత్నిస్తే వెంటనే తెలియజేయాలని సీబీఐ ఎయిర్‌పోర్ట్ అధికారులను కోరింది.

2012లో ఐసీఐసీఐ బ్యాంక్‌ నుంచి వీడియోకాన్‌ గ్రూప్‌నకు రూ.3,250 కోట్ల రుణం మంజూరుచేశారు. రుణం మంజూరులో పెద్ద ఎత్తున అక్రమాలను పాల్పడ్డారు. ఆ డబ్బుతో వీడియోకాన్‌ కంపెనీ అధినేత వేణుగోపాల్‌ ధూత్,చందా కొచ్చర్ భర్త దీపక్‌ ధూత్‌ న్యూపవర్‌ సంస్ధలో కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు.

దీంతో బ్యాంకు సీఈవో బాధ్యతల నుండి కొచ్చార్‌ను తప్పించింది ఐసీఐసీఐ.ఈ మొత్తం వ్యవహారంపై కొచ్చర్‌పై సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ ఆధ్వర్యంలోని స్వత్రంత కమిటీ విచారణ చేపడుతోంది. త్వరలోనే సీబీఐ అధికారులు కూడా చందా కొచ్చర్‌తో పాటు దీపక్‌ కొచ్చర్‌,వేణుగోపాల్‌ను ప్రశ్నించే అవకాశం ఉంది. బ్యాంకింగ్ రంగంలో ప్రకంపనలు రేపిన ఐసీఐసీఐ బ్యాంకు వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కొచ్చార్‌ స్ధానంలో సందీప్‌ బక్షి ఐసీసీ సీఈవోగా నియమితులైన సంగతి తెలిసిందే.

- Advertisement -