- Advertisement -
తెలంగాణలోని కల్వకుర్తి నుండి ఏపీ లోని కరివేన వరకు 122 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర జాతీయ రహదారుల శాఖ అనుమతి ఇచ్చింది. ఈ నూతన జాతీయ రహదారితో హైదరాబాద్ నుంచి తిరుపతి మధ్య 80 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. కల్వకుర్తి, నాగర్ కర్నూల్, కొల్లాపూర్, ఆత్మకూరు, నంద్యాల నియోజకవర్గాలను కలుపుతూ ఈ జాతీయ రహదారి నిర్మాణం జరుగుతుంది.
ఈ ప్రాజెక్టులో భాగంగా సోమశిల సిద్దేశ్వరం బ్రిడ్జి నిర్మాణం కూడా చేపట్టనున్నారు.కేంద్ర రవాణా శాఖ భారతమాల పథకం కింద ఈ జాతీయ రహదారికి అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్ర ప్రభుత్వం 800 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. 86 కిలోమీటర్లు తెలంగాణలో, 26 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్‌లో ఈ రహదారి నిర్మాణం చేపట్టనున్నారు.
- Advertisement -