ఒమిక్రాన్ బీఎఫ్ 7వేరియంట్…

43
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చర్యలు తప్పనిసరి చేస్తూ వివిధ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ బీఎఫ్‌7 వేరియంట్ భారత్‌లోకి ప్రవేశించిదన్నారు. తాజాగా ఈ రోజు మూడు కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాస్క్‌లు తప్పనిసరి చేసింది. మాస్క్‌లు, శానిటైజర్‌, భౌతిక దూరంను పాటించాలని మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఒమిక్రాన్ వేరియంట్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలన్నారు. శారీరక వ్యాయామం, డీ విటమిన్ కోసం ఎండలో నడవాలని సూచించారు. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ఆహారంలో ప్రొటీన్లు ఉన్న ఆహారంను తీసుకోవాలని సూచించారు.

దీర్ఘకాలిక వ్యాధులు, ఊపిరితిత్తులు, శ్వాసకోశ, క్యాన్సర్ వంటి వ్యాధులున్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. కొవిడ్‌ ముప్పు ఇంకా ముగియలేదని అందరూ అలర్ట్‌గా ఉండాలని మన్సుఖ్‌ హెచ్చరించారు . కొవిడ్‌ బూస్టర్‌ డోస్‌ తీసుకోని వారంతా త్వరగా వేయించుకోవాలని, రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని సూచించారు.
లక్షణాలు
జలుబు
గొంతునొప్పి
దగ్గు
వాసన గుర్తించకపోవడం
ఒణుకుడు
ఛాతీలో నొప్పి

ఇవి కూడా చదవండి…

జామ ఆకుతో ఇన్ని ఉపయోగలా !

ఆస్తమాను తగ్గించే ‘ ఉష్ట్రసనం ‘ !

నిద్ర‌కు ముందు గ్రీన్ టీ తాగితే..?

- Advertisement -