ప్చ్.. భారీ కాంబినేషన్.. భారీ రిపేర్లు !

33
- Advertisement -

బ్రహ్మాండమైన కాంబినేషన్.. పైగా భారీ బడ్జెట్.. ఇండియన్ సినీ తెర పైనే గొప్పగా చెప్పుకుంటారు అని అందరూ పొగడ్తలు కురిపించారు. నిజంగా శంకర్ కి – కమల్ హాసన్ కి ఆ స్థాయి, ఆ స్టామినా ఉంది. కానీ.. వండిన బిర్యానీ ని ఓ స్పూన్ తిని చూస్తే యాఖ్ అనిపిస్తోంది. కారణం.. లైకా ప్రొడక్షన్స్ వారి అతి ప్రమేయం అనేది శంకర్ వాదన. శంకర్ అవుట్ ఫుట్ అంత నాసిరకంగా ఉంది కాబట్టే.. మేము ఇన్ వాల్వ్ అయ్యాం అనేది లైకా వారి ఆరోపణ. మొత్తమ్మీద భారతీయుడు 2 ఏ రీతిలోనూ తన స్థాయిలో లేదు. బేసిక్‌గా వంటకం మొదట్లోనే తన్నేసింది. రంగు, వాసన ఏదీ కుదరలేదు అన్నట్టు.. యాక్షన్, ఎమోషన్, ట్విస్ట్ లు ఇలా సినిమాలో ఏది కుదరలేదు. సరే అని రిపేర్లు చేద్దాం అని కొన్ని సీన్స్ రీషూట్ చేశారు. ఫలితం ఇంకా దారుణం ఉందని టాక్ నడుస్తోంది. మరి ఇప్పుడేం చేయాలి ?, వంటను పారేయలేరు కదా. పోనీ, కస్టమర్లకు వడ్డిస్తే..బూతులతో విరుచుకు పడతారు. అందుకే, ఇండియన్ 2 చిత్రం షూటింగ్ మళ్లీ ఆగింది. ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నవాళ్లు, ఇంకాస్త వెయిట్ చేయండి, తప్పదు. ఎందుకంటే.. ఈ సినిమా ఫీడ్ ఏం చేయాలో ఇటు నిర్మాతలకు, అటు హీరో కమల్ హాసన్ కు అర్థం కావడం లేదు. దర్శకుడు శంకర్ మాత్రం నిమ్మలంగా ఉన్నాడు. పనిలో పనిగా రామ్ చరణ్ సినిమా షూటింగ్ ను మళ్లీ మొదలు పెట్టాడు. బహుశా ఈ మధ్య కాలంలో ఇండియన్ 2 సినిమా ట్రోలింగుకు గురైన విధంగా.. మరో సినిమా జరిగి ఉండదు. మరోపక్క తన విక్రమ్ సినిమా సూపర్ హిట్ కావడంతో.. కమల్ హాసన్ కి ఈ సినిమా హిట్ చాలా కీలకం కానుంది. ఒకవేళ ఈ సినిమా కూడా హిట్ అయితే, కమల్ మార్కెట్ డబుల్ అయినట్టే. అందుకే.. భారతీయుడు 2 పై కమల్ భారీ హోప్స్ పెట్టుకున్నాడు. మరి ఆ హోప్స్ కి న్యాయం జరుగుతుందా ?, లేదా ? అనేది ప్రేక్షకులే డిసైడ్ చేయాలి.

ఇవి కూడా చదవండి…

రవితేజతో నటించడం అదృష్టటం:శ్రీలీల

ఇన్ స్టాగ్ర‌మ్ కే వేడెక్కిస్తోంది.. కానీ?

SSMB28 కోసం లాంగ్ షెడ్యూల్

- Advertisement -