ఆస్తమాను తగ్గించే ‘ఉష్ట్రసనం’!

61
- Advertisement -

ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయో మనం తరచూ పుస్తకాల్లో చదువుతుంటాము. అలాగే యోగా యొక్క ఉపయోగాల గురించి నిపుణులు వైద్యులు చెబుతూనే ఉంటారు. అయితే ఈ యోగాలో ఎన్నో రకాల ఆసనాలు ఉంటాయి. ప్రతి ఆసనానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటూనే.. ప్రతి దానికి కూడా ఎంతో కొంత ఆరోగ్య లాభం కూడా ఉంటుంది. అందువల్ల మన జీవన విధానంలో యోగాకు తప్పనిసరిగా ప్రదాన్యత ఇవ్వాలని నిపుణులు పదే పదే చెబుతూ ఉంటారు కూడా. ఇక ఈ రోజు ఆస్తమా మొదలుకొని వెన్ను సమస్యల వరకు అన్నిటికి చెక్ పెట్టె ఉష్ట్రసనం గురించి తెలుసుకుందాం !

ఉష్ట్రసనం వేయడం వల్ల వెన్నెముక సడలించబడుతుంది. అలాగే మెదడుకు రక్త ప్రసరణ కూడా వృద్ది చెందుతుంది. విపుకు సంబంధించిన ఎన్నో రకాల వ్యాధులను ఈ ఉష్ట్రసనం నయం చేస్తుంది. ఇంక మడమలు, తొడలు, శరీరం, ఛాతీ, గొంతు పొత్తి కడుపులో నొప్పి వంటి సమస్యలు కూడా ఈ ఉష్ట్రసనం వేయడం వల్ల దూరం అవుతాయి. ముఖ్యంగా మెడ మరియు పొత్తి కడుపులో అంగాలను నియంత్రిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా చాలమందిని వేదించే ఉబుసం, ఆస్తమా,వంటి సమస్యలను తగ్గించడంతో పాటు శ్వాసకోసలను మెరుగుపరిచి ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే చాలా మందిని పదే పదే వేదించే తలనొప్పి, గొంతు సమస్యలను కూడా నియంత్రించి నివారిస్తుంది.. ఈ ఉష్ట్రసనం.

ఉష్ట్రసనం వేయు విధానం

ముందుగా రెండు కాళ్ళను దగ్గరకు ఉంచుకొని మోకాళ్ళపై కూర్చొని కాలివేళ్ళను మెడమలను కాస్త ఒంపుగా ఉంచి అలాగే మోకళ్లపై ఉండాలి. శరీరం వెన్నెముక సమాంతరంగా ఉంచి అరచేతులను సంబంధిత మోకాళ్ళకు ఆనించాలి. మోకాళ్ళ మీద శరీరాన్ని వెనుకకు వంచి కుడి మెడమను కుడి చేతితోనూ, ఎడమ మడిమను ఎడమ చేతితోనూ పట్టుకోవాలి. మడమలను గట్టిగా పట్టుకొని నడుము తొడలను వెనక్కి ఉంచి, తలను మెడను వీలైనంత వెనక్కి వంచాలి. కటి భాగాన్ని, నడుమును కొద్దిగా ముందుకు నెట్టాలి. శ్వాసను మామూలుగా పీల్చి వదులుతూ ఈ స్థితిలో 6-8 సెకన్ల పాటు అలాగే ఉండిపోవాలి. ఈ విధంగా 5-6 నిముషాలు చేయాలి.

గమనిక
ఈ ఆసనాన్ని గర్భిణీ స్త్రీలు వేయడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు..

Also Read:Harish:ఓటుతో కాంగ్రెస్‌కు బుద్దిచెప్పండి

- Advertisement -