దాదాపు నాలుగేళ్ల తర్వాత భారత్, చైనా మధ్య కీలక ఒప్పందం జరిగింది. తూర్పు లద్దాఖ్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంట పెట్రోలింగ్‌ను తిరిగి ప్రారంభించడానికి భారత్, చైనాలు ఒక ఒప్పందానికి వచ్చాయి.
16వ బ్రిక్స్ సదస్సు కోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ…రష్యా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ కీలక ముందడుగు పడడం విశేషం. ఇరు దేశాల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి పెట్రోలింగ్‌పై ఒప్పందం కుదిరిందని భారతదేశ అధికారులు వెల్లడించారు. ఈ ఒప్పందం బలగాల ఉపసంహరణతో పాటు 2020లో తలెత్తిన సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ నెల 22, 23న రష్యాలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో జరగనుంది. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు, భారత ప్రధాని మోడీ భేటీ కానున్నారు. గల్వాన్ లోయలో 2020లో భారత్- చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
Also Read:బాసరలో ఎరువుల కొరత

