భారతదేశంలో రాబోయే ఎన్నికల సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది ఎన్నికల సంఘం. పోలింగ్ జరిగే రోజుల్లో ఉద్యోగులకు చెల్లింపు సెలవు (Paid Holiday) ఇవ్వాలని ప్రకటించింది.ఎన్నికల రోజున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని… ఆ రోజు పనిచేసినా కూడా పూర్తి వేతనం ఇవ్వాలి అన్నారు.
ఈ నిర్ణయంతో ఓటింగ్ శాతం పెరగడం,ప్రతి పౌరుడు తన ఓటు హక్కు వినియోగించుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్నికల రోజున ఉద్యోగులకు సెలవు ఇవ్వకపోతే…సంస్థలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది అని కూడా కమిషన్ హెచ్చరించింది.
ఎన్నికల కమిషన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. మీ ఓటు మీ హక్కు – తప్పకుండా వినియోగించండి అని పిలుపునిచ్చింది. మొత్తంగా పోలింగ్ రోజున చెల్లింపు సెలవు ఇవ్వడం ద్వారా ప్రతి ఒక్కరూ సులభంగా ఓటు వేయగల అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.
Also Read:వీళ్ల పాలన చూస్తుంటే బీపీ లేస్తుంది!

