ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)లో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా ఆప్ నేత అనురాగ్ దండా తీవ్ర విమర్శలు చేశారు.అనురాగ్ ధండా మాట్లాడుతూ…మీరు నరేంద్ర మోదీకి భయపడి, ఆయనపై మాట్లాడేందుకు సంకోచిస్తున్నారు అని విమర్శించారు.
అతను పార్టీ వైఖరికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని కూడా ఆరోపించారు. ఇటీవల రాఘవ్ చద్దా పార్టీపై ప్రశ్నలు లేవనెత్తారు. పార్లమెంట్‌లో ప్రజా సమస్యలను లేవనెత్తానని చెప్పారు.“నేను ఏదైనా తప్పు చేశానా?” అని ప్రశ్నించారు.తనను మాట్లాడనివ్వడం లేదని ఆరోపించారు.
Also Read:వీళ్ల పాలన చూస్తుంటే బీపీ లేస్తుంది!
ఈ ఘటనతో ఆప్‌లో అంతర్గత విభేదాలు ఉన్నాయన్న చర్చ మొదలైంది. పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.మొత్తంగా, రాఘవ్ చద్దా–అనురాగ్ ధండా మధ్య మాటల యుద్ధం ఆప్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది.

