టైప్-1 డయాబెటిస్ ఉన్నవారికి డిమెన్షియా (మతిమరుపు వ్యాధి) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనం వెల్లడించింది. అమెరికాలో నిర్వహించిన ఈ పరిశోధనలో సుమారు 2.8 లక్షల మందిని పరిశీలించారు.
డయాబెటిస్ లేని వారిలో డిమెన్షియా: 0.6%,టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో: 1.8%,టైప్-1 డయాబెటిస్ ఉన్నవారిలో: 2.6%.. అంటే టైప్-1 డయాబెటిస్ ఉన్నవారికి డిమెన్షియా వచ్చే అవకాశం సుమారు 3 రెట్లు ఎక్కువ అని అధ్యయనంలో తేలింది.
వైద్య నిపుణుల ప్రకారం, దీనికి కొన్ని కారణాలు ఉండవచ్చు…
రక్తనాళాల నష్టం (Blood vessel damage)
దీర్ఘకాలిక ఇన్‌ఫ్లమేషన్
మెదడులో ఇన్సులిన్ ప్రభావం మార్పులు. ఇవి మెదడు పనితీరును ప్రభావితం చేసి డిమెన్షియాకు దారి తీస్తాయి
డిమెన్షియా అనేది ఒక వ్యాధి కాదు కొన్ని లక్షణాల సమాహారం. జ్ఞాపకశక్తి తగ్గడం,ఆలోచన, నిర్ణయ సామర్థ్యం తగ్గడం,రోజువారీ పనులు చేయడంలో ఇబ్బంది. టైప్-1 డయాబెటిస్ ఉన్నవారిలో దాదాపు 65% డిమెన్షియా కేసులు ఈ వ్యాధితో సంబంధం ఉండొచ్చని అంచనా. వయస్సు పెరిగే కొద్దీ ప్రమాదం మరింత పెరుగుతుంది. టైప్-2 డయాబెటిస్‌తో పోలిస్తే టైప్-1లో ప్రమాదం ఎక్కువ.
Also Read:వీళ్ల పాలన చూస్తుంటే బీపీ లేస్తుంది!
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలి. మెదడు ఆరోగ్యాన్ని కాపాడే అలవాట్లు (వ్యాయామం, నిద్ర) పెంచాలి.మొత్తంగా, టైప్-1 డయాబెటిస్ ఉన్నవారు మెదడు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని ఈ పరిశోధన సూచిస్తోంది.

