వీళ్ల పాలన చూస్తుంటే బీపీ లేస్తుంది!

9
- Advertisement -

కొత్తగూడెంలో జరిగిన ప్రజాపాలన–ప్రగతి నివేదిక 99 రోజులు కార్యక్రమంలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు… కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వీళ్ల పరిపాలన చూస్తుంటే బీపీ లేస్తుంది. తిట్టలేక ఈ మాట అంటున్నా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం పనితీరును విమర్శిస్తూ, ప్రజల సమస్యలపై సరైన దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు. పాలనకు తెలివి ఉండాలి, పట్టుదల ఉండాలి, దీక్ష ఉండాలి. కానీ ఈ ప్రభుత్వంలో అవేవీ కనిపించడం లేదు అంటూ కాంగ్రెస్ నాయకత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.

అధికారంలో ఉన్నవారు బాధ్యతతో వ్యవహరించకపోతే ప్రజలు ఇబ్బందులు పడతారని హెచ్చరించారు. కొత్తగూడెం బస్టాండ్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.

కూనంనేని వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోందని, ప్రతిపక్షాలు ఈ అంశాన్ని బలంగా తీసుకుంటున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

Also Read:‘గాయపడ సింహం..’బ్రైడ్ సాంగ్’

- Advertisement -