అస్సాంలో పెరిగిన పొలిటికల్ హీట్

6
- Advertisement -

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు కాంగ్రెస్ నేత గౌరవ్ గగోయ్. అతను వేల అబద్ధాలు చెప్పొచ్చు, కానీ కాంగ్రెస్ వాటన్నింటినీ బయటపెడుతుంది అని గౌరవ్ గోగోయ్ అన్నారు.

ఇటీవల సీఎం హిమంత బిస్వా శర్మ….కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలకు “పాకిస్తాన్ లింక్” ఉందని పేర్కొంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు నిర్వహించిన ప్రెస్ మీట్‌లలో ఉపయోగించిన సమాచారానికి పాకిస్తాన్‌కు చెందిన సోషల్ మీడియా గ్రూప్ సంబంధం ఉందని ఆయన ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చిన గౌరవ్ గోగోయ్…సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ ..అతను ఎంత అబద్ధాలు చెప్పినా, వాటిని ఒక్కొక్కటిగా బయటపెడతాం అన్నారు. ఈ వివాదం అస్సాం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మరింత రాజకీయ ఉద్రిక్తతను పెంచింది.

AlsoRead:CSKపై RCB వరుసగా నాలుగో గెలుపు

సీఎం సర్మ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ నేతలు పూర్తిగా ఖండిస్తూ, వాటిని రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. మరోవైపు శర్మ ఈ విషయంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు.

- Advertisement -