సుశాంత్ ఆత్మహత్య మిస్టరీని చేధించే పనిలో భాగంగా విచారణను వేగవంతం చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియాపై పోలీసులు కేసు నమోదుచేశారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణానికి రియా చక్రవర్తి కారణమని ఆరోపిస్తూ.. బీహార్‌లోని ముజఫ్ఫర్‌పూర్‌కి చెందిన కుందన్‌కుమార్ అనే వ్యక్తి ఆమెపై కోర్టులో కేసు వేశాడు.సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని గంటల ముందు రియాకు సుశాంత్ ఫోను చేయగా ఆమె లిఫ్ట్ చేయలేదని తెలిసింది. దీంతో ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించేందుకు గాను రియా చక్రవర్తిపై కేసు నమోదుచేసినట్లు సమాచారం.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సుశాంత్‌ది ఆత్మహత్యే అని పోస్ట్‌మార్టం రిపోర్టులో తేలినప్పటికీ.. ఈ ఆత్మహత్య వెనుక కారణాలేంటి? ఎవరైనా ప్రేరేపించారా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది.