బాలీవుడ్ డ్రగ్స్‌ వ్యవహారంలో ప్రముఖ హీరోయిన్లు..?

190
rakul

హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతితో బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. సుశాంత్‌ ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌ర్తి అరెస్టుతో ఈ డ్రగ్స్ వ్యవహారం బ‌య‌ట‌ప‌డింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారుల విచార‌ణ‌లో సుమారు 25 మంది బాలీవుడ్ ప్ర‌ముఖుల‌కు డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంతో సంబంధం ఉన్న‌ట్లు రియా చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

తాజాగా ఈ వ్యవహారంలో బాలీవుడ్ హీరోయిన్లు ర‌కుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ పేర్లు బయటికొచ్చాయి. త‌న‌‌తో క‌లిసి డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు రియా వెల్ల‌డించిన‌ట్లు సమాచారం. ఈ వార్తలు వచ్చినప్పటి నుంచి రియా చక్రవర్తి – రకుల్ ప్రీత్ సింగ్ కలిసి ఉన్న ఫొటోలో నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన రియా ఆమె సోదరుడు షోవిక్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.