రియా చక్రవర్తి కస్టడీ పొడగింపు..

131
Rhea Chakraborty

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మృతి వ్యవహారంలో డ్రగ్స్ కోణం బయట పడడంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) దర్యాప్తు జరుపుతోంది. ఈ దర్యాప్తులో భాగంగా ఎన్సీబీ నటి రియా చక్రవర్తిని, ఆమె సోదరుడు షోవిక్ ను అరెస్ట్ చేయడం తెలిసిందే. డ్రగ్స్ అభియోగాలపై రియా చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు సెప్టెంబరు 9న అరెస్ట్ చేశారు. సుశాంత్ కు రియానే డ్రగ్స్ సమకూర్చినట్టు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. డ్రగ్స్ సిండికేట్ లో రియా చక్రవర్తి ఒక యాక్టివ్ మెంబర్ అని ఎన్సీబీ భావిస్తోంది. ఈ కేసులో వరుసగా మూడ్రోజుల పాటు రియాను ప్రశ్నించిన ఎన్సీబీ ఆపై ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచింది.

అయితే వీరి జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియగా, స్థానిక న్యాయస్థానం ఆ కస్టడీని అక్టోబరు 6 వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలో రియా, షోవిక్ బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. బాంబే హైకోర్టులో వారి న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై రేపు విచారణ జరగనుంది. ఇదిలా ఉంటే రియా విచారణలో సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్‌తో పాటు రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు కూడా బయటికి వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. వాళ్లకు కూడా ఈ వారం నార్కోటిక్స్ అధికారులు సమన్లు జారీ చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి రియా మాత్రం అక్టోబర్ 6 వరకు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి అయితే వచ్చింది.