‘కెప్టెన్ మిల్లర్’.. ప్రియాంకా షూటింగ్ పూర్తి

34
- Advertisement -

నేషనల్ అవార్డ్ విన్నర్, సూపర్ స్టార్ ధనుష్ హై-బడ్జెట్ పీరియడ్ ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. 2023లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పీరియాడికల్ ఫిల్మ్ 1930-40ల నేపథ్యంలో తెరకెక్కుతోంది. ధనుష్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా టీజర్ నేషనల్ వైడ్ ట్రెండ్ అయ్యింది.

ఈ పీరియడ్ ఫిల్మ్ లో ప్రియాంకా అరుళ్‌ మోహన్ కథానాయిగా నటిస్తోంది. తాజాగా ఆమె పోర్షన్ కి సంబధించిన షూటింగ్ పూర్తి చేశారు మేకర్స్. ఈ సందర్భంగా విడుదల చేసిన వర్కింగ్ పోస్టర్ లో దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ కు పాయింట్ బ్లాంక్ లో గన్ గురి పెటినట్లు కనిపించింది.

ఈ చిత్రాన్ని టి.జి. త్యాగరాజన్ సత్యజ్యోతి ఫిల్మ్స్, సెంధిల్ త్యాగరాజన్ ,అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. జి. శరవణన్, సాయి సిద్ధార్థ్‌ సహా నిర్మాతలు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి, సిద్ధార్థ నుని డీవోపీ గా పని చేస్తున్నారు. బాహుబలి ఫ్రాంచైజీ, RRR, పుష్ప వంటి చిత్రాలకు పనిచేసిన మధన్ కార్కీ ఈ చిత్రం తమిళ వెర్షన్‌కు డైలాగ్స్ రాశారు. నాగూరన్ ఎడిటర్.‘కెప్టెన్ మిల్లర్’ డిసెంబర్ 15, 2023న తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.తారాగణం: ధనుష్, ప్రియాంక మోహన్, సందీప్ కిషన్, డాక్టర్ శివ రాజ్ కుమార్.

Also Read:కాళేశ్వరం ‘ప్యాకేజీ 9’కు చెన్నమనేని రాజేశ్వర్ రావు పేరు

- Advertisement -