కాంగ్రెస్ అబద్దాలను కడిగేసిన కాగ్

5
- Advertisement -

కాంగ్రెస్ నేతలు చేస్తున్న అబద్ధాలను కడిగి పారేసింది కాగ్. రాష్ట్ర ఆదాయంలో మొత్తం మిత్తీలకే పోతుంది అంటూ గత కేసీఆర్ ప్రభుత్వం మీద నోటికొచ్చినట్టు అసత్యాలను ప్రచారం చేస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు.

CAG లెక్కల ప్రకారం Dec 2023 నుండి ఇప్పటి వరకు కట్టిన మిత్తి కేవలం రూ. 21,838 కోట్లు మాత్రమే, కానీ కాంగ్రెస్ దొంగలు మాత్రం ప్రచారం చేస్తున్నది రూ. 80,000 కోట్లు , తప్పుడు లెక్కలు చెప్పిన సొమ్ము ఎక్కడికి పోయినట్టు, ఏం చేసినట్టు? అని ప్రశ్నించారు.

అందరూ అనుకున్నట్టే తెలంగాణ సొమ్మును మూటలు కట్టి ఢిల్లీకి తరలిస్తున్నరు అన్నది స్పష్టమవుతుంది. బిడ్డా.. ఎన్నికల్లో మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, దొంగ లెక్కలు చెప్పి ఎంత తప్పించుకోవాలనే ప్రయత్నం చేసినా మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని తెలిపారు.

Also Read:వయనాడ్..కాంగ్రెస్‌దే

- Advertisement -