- Advertisement -
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల వైకుంఠపురంలో’. 2020 సంక్రాతి కానుకగా జనవరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకురాగా మ్యూజికల్‌గానే కాదు బాక్సాఫీస్‌ను షేక్ చేసింది ఈ మూవీ. బన్నీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
ముఖ్యంగా ఈ సినిమాలో రాములో రాములా,బుట్ట బొమ్మ సాంగ్‌కి స్టెప్పులేయని వారుండరూ. అంతగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయి ఈ సాంగ్స్. ముఖ్యంగా బుట్టబోమ్మ సాంగ్ యూ ట్యూబ్‌ని షేక్ చేసింది.
తాజాగా ఈ పాట మరో రికార్డు బద్దలు కొట్టింది. తెలుగు ఇండస్ట్రీలో 300 మిలియన్ ప్లస్ వ్యూవ్స్ వచ్చిన మొదటి పాటగా నిలిచింది. ఈ విషయాన్ని అల వైకుంఠపురం మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
- Advertisement -