బుట్ట‌బొమ్మ సాంగ్స్ మరో ఘ‌న‌త..

36
Butta Bomma

టాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ సాంగ్‌ ‘బుట్టబొమ్మ’ ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్, పూజా హెగ్డే జంట‌గా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన చిత్రం అల వైకుంఠ‌పుర‌ములో. ఈ చిత్రానికి థ‌మ‌న్ స్వ‌రాలు అందించ‌గా, ఇందులోని ప్ర‌తి పాట శ్రోత‌ల‌ను ఎంత‌గానో అల‌రించింది. సినిమా రిలీజ్‌కు ముందే సాంగ్స్ సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డంతో మూవీపై అంచ‌నాలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా బుట్ట‌బొమ్మ సాంగ్ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. ఈ పాట ఇప్పటికీ రికార్డులు క్రియేట్ చేస్తుండ‌డం విశేషం.

బుట్ట‌బొమ్మ సాంగ్ రీసెంట్‌గా యూట్యూబ్​లో 601 మిలియన్ల(60 కోట్ల) వీక్షణలు సాధించిన తొలి తెలుగు పాటగా రికార్డు నెలకొల్పింది. తాజాగా ఈ సాంగ్‌కు యూ ట్యూబ్‌లో 400 మిలియ‌న్ లైక్స్ రాగా, తెలుగులో ఇలాంటి ఘ‌న‌త సాధించిన తొలి తెలుగు పాట‌గా రికార్డ్ నెల‌కొల్పింది. బుట్ట‌బొమ్మ సాంగ్స్ సాధిస్తున్న రికార్డ్స్ ప‌ట్ల అభిమానుల‌తో పాటు చిత్ర బృందం సంతోషం వ్య‌క్తం చేస్తుంది. ప్ర‌స్తుతం బ‌న్నీ.. పుష్ప సినిమాతో బిజీగా ఉండ‌గా, ఈ చిత్రాన్ని సుకుమార్ తెర‌కెక్కిస్తున్నారు.