వెల్ డన్ బన్నీ : వార్నర్

77
warner

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ టిక్ టాక్ లో చాలా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకు కెప్టెన్ గా ఉండటంతో తెలుగు పాటలకు టిక్ టాక్ లో వార్నర్ వేసిన స్టెప్పుల వీడియోలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అల్లు అర్జున్ అల..వైకుంఠపురం సినిమాలోని బుట్టబొమ్మ సాంగ్ కు వార్నర్ అదిరే స్టెప్పులతో దుమ్మురేపాడు.

తాజాగా ఈ సినిమాలోని బుట్టబొమ్మ సాంగ్‌ రికార్డులు క్రియేట్ చేసింది. 450 మిలియన్ వ్యూస్ దక్కించుకోగా డేవిడ్ వార్నర్… బన్నీకు తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్డన్ అంటూ విషెస్ తెలిపాడు.

ప్ర‌స్తుతం బన్నీ… పుష్ప సినిమాతో బిజీగా ఉండ‌గా, డేవిడ్ వార్న‌ర్ భార‌త్‌తో జ‌ర‌గ‌నున్న స‌మరానికి సిద్ద‌మ‌వుతున్నాడు.