‘బేబీ’ హీరోయిన్‌ కు మరో బంపరాఫర్!

159
- Advertisement -

హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్‌లు నటించిన చిత్రం ‘బేబి’. ఈ సినిమా విడుదలై 20 రోజులైంది. త్వరలో ఓటీటీలో విడుదల కానుంది. తాజాగా టాలీవుడ్ వర్గాల్లో ఈ సినిమాపై ఒక వార్త ప్రచారం జరుగుతుంది. ఈ మూవీని ఓటీటీలో మాత్రం ఒక గంట నిడివితో కలిపి నెట్ ఫ్లిక్స్‌లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇందులో ఒక సాంగ్‌తో పాటు కొన్ని సీన్లను చేర్చనున్నట్లు సమాచారం. ఈ సీన్స్ లో వైష్ణవి చైతన్య అద్భుతంగా ఉంటుందని.. ఆమెకు ఈ సీన్స్ మరింతగా మంచి పేరు తెచ్చి పెడతాయి అని టాక్ నడుస్తోంది.

మొత్తానికి ‘బేబీ’ సినిమాతో హీరోయిన్‌ గా వైష్ణవి చైతన్యకు ఫుల్ క్రేజ్ వచ్చింది. అందుకే, ప్రస్తుతం వైష్ణవి చైతన్యకు వరుస అవకాశాలు వస్తున్నాయి. తాజాగా వైష్ణవి చైతన్యకు మరో బంపరాఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సరసన రెండో హీరోయిన్‌గా వైష్ణవి చైతన్యను సెలెక్ట్ అయినట్లు టాక్. ‘బేబీ’ సినిమాలో ఆమె నటన చూసి ఫిదా అయిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. ‘డబుల్ ఇస్మార్ట్’లో వైష్ణవి చైతన్యకు ఛాన్స్ ఇచ్చాడట.

Also Read:భగవంత్ కేసరి..ఫ్యాన్స్‌కు పండగే

పైగా ఈ సినిమాలో నటించేందుకుగానూ వైష్ణవి చైతన్యకు రూ.90 లక్షల రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఎంతైనా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా అంటే.. కచ్చితంగా వైష్ణవి చైతన్య కెరీర్ కు ప్లస్ అవుతుంది. దీనికితోడు వైష్ణవి చైతన్య పాత్ర కూడా ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీలో వెరీ బోల్డ్ గా ఉంటుందట. మరి డబుల్ ఇస్మార్ట్ సినిమా వైష్ణవి చైతన్యకి ఏ రేంజ్ లో సక్సెస్ ఇస్తోందో చూడాలి.

Also Read:భోజనానికి ముందు పెరుగు తింటే ప్రమాదమా?

- Advertisement -