అరెరే..  ఆ బిల్డప్ ల  జోలికి ఎందుకు పోయినట్టు ? 

176
- Advertisement -

ఒకేలా కనిపించే వ్యక్తులను కలవడం వల్ల జరిగిన ప్రమాదాల కారణంగా..  మారిపోయిన పరిణామాలపై  నందమూరి కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ అంటూ ఓ వైవిధ్యమైన సినిమా చేస్తున్నాడు. నిజంగా సినిమా బాగు కోసం తపన పడే నటుడిగా,  నిర్మాతగా కళ్యాణ్ రామ్ కి చాలా మంచి పేరు ఉంది. కమర్షియల్ హిట్ కోసం పాకులాడకుండా  నిత్యం కొత్త రకం కథల్లో  మమేకమవుతూ తన వంతు బాధ్యతను నెరవేర్చడానికి కళ్యాణ్ రామ్ ఎంతో కష్టపడతాడు. కానీ ఫలితం దగ్గరకు  వచ్చేసరికి,  అందని పండ్ల కోసం అర్రులు చాచినట్లే ఉంటుంది వ్యవహారం.  ఫైనల్ గా  సినిమాకి కలెక్షన్స్ రావు. ఎన్నో చిత్రాలు  ఈ నిజాన్ని రుజువు చేశాయి కూడా.  అయినా  కళ్యాణ్ రామ్ మాత్రం  వైవిధ్యం అనే తన విభిన్న తాపత్రయాన్ని వదలలేదు.

గంగిగోవు పాలు గరిటడైన చాలు అన్నట్లు,  మంచి సినిమాకి  ఆ కొద్దీ కలెక్షన్లే చాలు అన్న దగ్గరే మిగిలిపోయాడు కళ్యాణ్ రామ్.  ప్రస్తుతం అమిగోస్ షూటింగ్ దశలో ఉంది. కానీ, అప్పుడే  ఈ సినిమాలో మ్యాటర్ గురించి నెగిటివ్ ప్రచారం మొదలైంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్  భారీ యాక్షన్ హీరో రేంజ్ లో ఫైట్లు గట్రా చేశాడట. అరె, పాన్ ఇండియా స్టార్లే.. బిల్డప్పు  వేషాలు వేస్తుంటే.. ఆయా  స్టార్ల చిత్రాలను ప్రేక్షకులు ఈడ్చి తంతున్నారు.  మరి అలాంటిది కళ్యాణ్ రామ్ అనే మీడియం రేంజ్ హీరో  ఆ బిల్డప్పుల జోలికి ఎందుకు పోయినట్టు..?.  ఇప్పుడున్న  ఈ డిజిటల్ ప్రపంచంలో  ప్రేక్షకులు చిన్న అండ్ మీడియం రేంజ్ హీరోల నుంచి భారీ అండ్ బిల్డప్  ఫైట్లను అస్సలు ఇష్టపడడం లేదు.

మరి కళ్యాణ్ రామ్ కు ఈ మాత్రం తెలియదా..?.  అసలు,  గతంలో తన నుంచి వచ్చిన  ‘ఇజం, ఓమ్’ లాంటి యాక్షన్ సినిమాలు  ఎందుకు గాలిలో కలిసిపోయాయి  అని కళ్యాణ్ రామ్ విశ్లేషణ చేసుకున్నట్లు లేడు. చేసుకుంటే.. సేమ్  బిల్డప్పులు, అదే దిక్కుమాలిన  ఆ అతిని  ఈ అమిగోస్ సినిమాలో ఇరిక్కించే వాడు కాదు.  అసలు స్టార్  హీరోలే  బిల్డప్పులు జోలికి పోకుండా  సెటిల్డ్ పెర్ఫామెన్స్ లతో సతమవుతున్నారు. ఒకసారి కళ్యాణ్ రామ్ ఈ విషయంలో విశ్లేషణ చేసుకుంటే మంచిది.

ఇవి కూడా చదవండి…

శ్రుతి హాసన్ కి మహర్దశ.. కానీ ఓ పెద్ద సమస్య ?

ప్చ్..   ఈ ‘వారసుడు’ మజిలీ ఎటువైపు ?

రష్మిక మందన్నా… నిత్య కళ్యాణం పచ్చ తోరణం ! 

- Advertisement -