- Advertisement -
2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో నేషనల్ పాలిటిక్స్ వేడెక్కాయి. ఎటు అధికార బీజేపీ, అటు విపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలతో ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీయే సర్కార్ ను గద్దె దించేందుకు విపక్షాలన్నీ ఏకమతున్నాయి. అటు బీజేపీ కూడా మిత్రపక్షాలను కూడగట్టుకునే పనిలో ఉంది. దీంతో నేషనల్ పాలిటిక్స్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కాగా విపక్షాల ఐక్యత కోసం బెంగళూరులో 26 పార్టీలు నిన్న నేడు సమావేశం అయిన సంగతి తెలిసిందే. .
ఈ సమావేశంలో విపక్ష కూటమికి సంబంధించి చాలానే చర్చలు జరిగాయి ముఖ్యంగా విపక్ష కూటమికి ” INDIA ” అనే నామకరణం కూడా జరిగింది. అటు బీజేపీ కూడా ఎన్డీయే మిత్రపక్షాలతో నేడు బేటీ అయి కీలక అంశాలపై చర్చలు జరిపే ప్రయత్నం చేస్తోంది. కాగా జాతీయ రాజకీయాలు ఇంత రసవత్తరంగా ఉన్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలోని అధినేతలు మాత్రం మౌనం పాటిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఏపీ సిఎం వైఎస్ జగన్ మరియు తెలంగాణ సిఎం కేసిఆర్ లు అటు ఎన్డీయే తరుపుగాని ఇటు విపక్షాల కూటమి ” INDIA ” తరుపుగాని వెళ్లకుండా జాతీయ రాజకీయాలను గమనిస్తున్నారు.
Also Read:పిక్ టాక్ : ఫాలోవర్స్ కోసం అందాల వల
కాగా ఏపీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్డీయేలో చేరానున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఒక్క జనసేన పార్టీకి తప్పా వైసీపీకి గాని టీడీపీకి గాని ఎలాంటి పిలుపు అందలేదు. ఇటు విపక్షాల నుంచి కూడా ఈ రెండు పార్టీలకు పిలుపు రాలేదు. అటు తెలంగాణ విషయానికొస్తే దేశాన్ని నాశనం చేసిన బీజేపీ, కాంగ్రెస్ ల యొక్క కూటములకు మద్దతిచ్చే ప్రసక్తే లేదని బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఎప్పుడో స్పష్టం చేశారు. దీంతో ప్రస్తుతం జరుగుతున్నా జాతీయ పార్టీల అలయెన్స్ ల విషయంలో తెలుగు రాష్ట్రాల నేతల హడావిడి కనిపించడం లేదు. మరి ముందు రోజుల్లో వైసీపీ, టీడీపీ, బిఆర్ఎస్ పార్టీలు ఎటువైపు అడుగులు వేస్తాయో చూడాలి.
Also Read:జలుబు నివారణకు చిట్కాలు..
- Advertisement -