బాలయ్యతో చేశా.. అద్భుతమే!

60
- Advertisement -

తెలుగు తెరపై ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఐటెం గర్ల్స్ వస్తూనే ఉంటారు. ఎందరు ఐటెం గర్ల్స్ పరిచయం అయినా… తెలుగు ప్రేక్షకులు వారిని అక్కున చేర్చుకుంటూనే ఉన్నారు. తాజాగా చంద్రిక రవి అనే కొత్త భామ తెలుగు ప్రేక్షకులకు తన అందచందాలను ఘనంగా పరిచయం చేసింది. బాలకృష్ణ హీరోగా రాబోతున్న ‘వీర సింహ రెడ్డి’ సినిమాలో చంద్రిక రవి “మా బావ మనోభావాలు” అనే పాటలో ఆడిపాడింది. ఈ పాట ఇప్పటికే మాస్ ఆడియన్స్ ను అమితంగా ఆకట్టుకుంది. అందుకే.. చంద్రిక రవికి ఇప్పుడు యూత్ లో ఫుల్ క్రేజ్ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలో ఈ బ్యూటీ నెటిజన్లతో ముచ్చట్లు పెట్టింది.

మరీ, చంద్రిక రవి చెప్పిన ఆ ముచ్చట్లు ఏమిటో అమ్మడు మాటల్లోనే విందాం. చంద్రిక రవి మాట్లాడుతూ.. “మా బావ మనోభావాలు” పాటకి వస్తున్న రెస్పాన్స్ చూసి నేను షాక్ అవుతున్నా. నాకు ఇప్పుడు ఎంతో ఆనందంగా వుంది. ఒక విధంగా బాలయ్య బాబు గారితో ఓ సాంగ్ చేయడం నా జీవితాన్నే మార్చేసింది. నాకు ఇప్పుడు అంతా గుడ్ టైమే నడుస్తోంది. నిజానికి నేను ఆస్ట్రేలియాలో ఓ చిన్న టౌన్ లో పుట్టినా.. మా కుటుంబ మూలాలు దక్షిణ భాతరదేశంలో వున్నాయి. అందుకే, నేను ఎక్కువగా సౌత్ సినిమాలే చూస్తూ పెరిగాను.

ముఖ్యంగా బాలయ్య బాబు గారి సినిమాలను ఎన్నో చూశాను. అలాంటిది ఆయనతోనే కలిసి డ్యాన్స్ చేసే ఛాన్స్ రావడం నా అదృష్టం. నిజానికి నాకు ఈ సినిమాలో అనుకోకుండా అవకాశం వచ్చింది. చాలామంది బాలయ్య బాబుతో పని చేయడం ఎలా అనిపించింది ? అని అడుగుతున్నారు. చంద్రిక రవి లాంటి ఒక హీరోయిన్ కి బాలయ్య బాబు గారితో పని చేయడం ఎలా ఉంటుంది. అద్భుతమే కదా. నాకు అయితే, ఇప్పటికీ ఎంతో ఆనందంగా ఉంది. బాలయ్య అంటే నాకు ఎంతో అభిమానం. ఆయనతో డ్యాన్స్ చేయడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి’ అంటూ చంద్రిక రవి చెప్పుకొచ్చింది. మరీ బాలయ్యతో పాట ఈ భామకు ఎంతవరకు కలిసి వస్తోందో చూడాలి.

ఇవి కూడా చదవండి…

నో డౌట్.. ‘చరణ్’కి గిట్టుబాటే !

సంక్రాంతి సినిమాకి డార్లింగ్ సపోర్ట్

‘వీరసింహారెడ్డి’ మాస్ మొగుడు సాంగ్

- Advertisement -