దానంపై అనర్హత వేటువేయండి:బీఆర్ఎస్

19
- Advertisement -

ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ను కోరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, ముఠాగోపాల్, బండారు లక్ష్మారెడ్డి. హైదరాబాద్ హైదర్‌గూడలోని స్పీకర్ నివాసంలో ఆయన్ని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానంపై వేటు వేయాలని వినతి పత్రం సమర్పించారు.

ఆదివారం సాయంత్రం 6 గంటలకు అపాయింట్ మెంట్ ఇచ్చారని కానీ నిర్ధేశిత సమయానికి స్పీకర్ నివాసానికి వెళ్లగా ఆయన అందుబాటులో లేరని చెప్పారు. తాము ఎదురుచూస్తున్నామని.. పలుమార్లు ఫోన్ చేసినా స్పీకర్ స్పందించలేదని వాపోయారు. అపాయింట్ మెంట్ ఇచ్చి స్పీకర్ కలవకపోవడం బాధాకరమని…సీఎం రేవంత్ ఒత్తిడితోనే తమను స్పీకర్ కలవలేదని ఆరోపించారు.

Also Read:సాల్ట్ టీ ఎప్పుడైనా తాగారా..ఎన్ని లాభాలో?

- Advertisement -