సుప్రీంలో ఎమ్మెల్సీ కవిత పిటిషన్

26
- Advertisement -

ఈడీ అక్రమ అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్‌ను ప్రతివాదిగా చేరుస్తూ ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అక్రమంగా అరెస్ట్ చేశారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగానే.. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని తెలిపారు. దర్యాప్తు సంస్థ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు భావించి.. తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కవిత తరఫు న్యాయవాది ఆన్ లైన్ లో పిటిషన్ దాఖలు చేయగా రేపు సుప్రీం కోర్టు విచారించనుంది. మరోవైపు కవితను రెండోరోజు ఈడీ అధికారులు విచారించనున్నారు. కవితతో పాటు కవిత భర్త అనిల్, వ్యక్తిగత సిబ్బందిని సైతం ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు.

ప్రతీ రోజూ సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో కలిసేందుకు కుటుంబ సభ్యులకు న్యాయస్థానం అనుమతించగా ఇంటి నుంచి తెచ్చిన ఆహారం తీసుకునేందుకు సైతం వెసులుబాటు కల్పించింది.

Also Read:దానంపై అనర్హత వేటువేయండి:బీఆర్ఎస్

- Advertisement -