తెలంగాణలో బిఆర్‌ఎస్ నేతలను ఇరకాటంలో పెట్టేందుకు శరవిధాల ప్రయత్నిస్తున్న కాషాయపార్టీకి.. ఎప్పటికప్పుడు చెంపెట్టు తగులుతూనే ఉంది. ఆయా రాష్ట్రాలలో ఎమ్మెల్యేలను అక్రమంగా అదుపులోకి తెచ్చుకొని అధికారంలోకి వచ్చిన బీజేపీ.. తెలంగాణలో కూడా అదే వ్యూహాన్ని అమలు చేసి అధికారం చేపట్టాలని చూసింది. అయితే కేసిఆర్ నాయకత్వంలో కమలనాథుల ప్రయత్నాలకు స్ట్రోక్ మీది స్ట్రోక్ పడింది. దాంతో బిఆర్‌ఎస్ నేతలపై అక్రమ కేసులకు తెరతీసింది కాషాయ పార్టీ..ఇటీవల కేసిఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను లిక్కర్ స్కామ్ లో ఇరికెంచే ప్రయత్నం చేసింది. ఇప్పుడు బెంగళూరు డ్రగ్స్ కేసులో పలువురు బిఆర్‌ఎస్ నేతలను ఇరికించే ప్రయత్నం కూడా చేస్తోంది. .
ముఖ్యంగా ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బీజేపీకి గట్టి షాక్ ఇచ్చిన తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పై ఇప్పటికే డ్రగ్స్ కేసులో ఈడీ నోటీసులను కూడా జారీ చేసింది. కాగా బెంగళూరు డ్రగ్స్ కేసుతో పైలెట్ రోహిత్ రెడ్డి కి సంబంధం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఈడీ నోటీసులు వచ్చిన మాట వాస్తవమేనని, కానీ డ్రగ్స్ కేసుతో తనేకలాంటి సంబందం లేదని పైలెట్ రోహిత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇదంతా బీజేపీ చేస్తున్న కుట్ర అని ఆయన అన్నారు. తాజాగా ఛార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ లో పూజలు నిర్వహించిన రోహిత్ రెడ్డి.. ఈ సందర్భంగా బండి సంజయ్ కి సవాల్ విసిరారు.
” బెంగళూరు డ్రగ్స్ కేసుతో తనాకెలాంటి సంబందం లేదని, ఒకవేళ ఆధారాలు ఉంటే బయట పెట్టలంటూ బండి సంజయ్ కి సవాల్ విసిరారు. తనకు 24 గంటలు టైమ్ ఇస్తున్నానని.. ఈలోపు ఆధారాలు బయట పెట్టాలని కోరారు రోహిత్ రెడ్డి. అయితే రోహిత్ రెడ్డి సవాల్ కు స్పందించిన బండి సంజయ్ వెనకడుగు వేశారు. సవాల్ కు స్పందించాల్సిన అవసరం లేదంటూ జారుకున్నారు. దీంతో కేవలం గాలి ఆరోపణలతోనే కక్ష పూరితంగా బీజేపీ వ్యవహరిస్తోందని మరోసారి రుజువైంది. నిజంగానే ఆధారాలు ఉండే బండి సంజయ్ సవాల్ స్వీకరించడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారనే విమర్శలు వ్యక్తమౌతున్నాయి. కేంద్రం గూప్పిట్లో ఉన్న ఈడీ, సిబిఐ సంస్థలను ప్రయోగిస్తూ రాజకీయ లబ్ది పొందేందుకే బీజేపీ చూస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇవి కూడా చదవండి….