ఇంటింటికీ ఇంటర్నెట్ సేవలే లక్ష్యం…

247
broadband internet for Everyone says KTR
- Advertisement -

వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఇంటింటికి ఇంటర్నెట్ అందించే లక్ష్యంతో పని చేయాలని మంత్రి కేటీఆర్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బేగంపేటలో పరిశ్రమలు,ఐటీ శాఖల్లో చేపట్టిన పలు ప్రాజెక్టులపై సుదీర్ఘ సమావేశం నిర్వహించిన కేటీఆర్ …మిషన్ భగీరథ ప్రాజెక్టు నిర్ణీత గడువులోగా పూర్తవుతున్న నేపథ్యంలో ఇంటింటికి ఇంటర్నెట్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలన్నారు.

కేంద్రప్రభుత్వం భారత్ నెట్ కింద అందిస్తున్న ఆర్థిక సహాయంతో పాటు, రాష్ర్ట  ప్రభుత్వం తరపున కావల్సిన ఆర్థిక సహకారాన్ని అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ కు విజయ బ్యాంక్ 561కోట్ల రూపాయలు రుణాన్ని అందించే పత్రాలను బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ సత్యనారాయణ రాజు మంత్రికి అందించారు. వచ్చే ఏడాది నాటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందించడంతో గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని మంత్రి తెలిపారు.

 broadband internet for Everyone says KTR

తెలంగాణలో ఇంటింటికీ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత జరిగే ప్రయోజనాలను ఈ నెట్‌ వర్క్‌ తెలియజేస్తుంది. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో 10 ప్రముఖ కంపెనీలు పాలుపంచుకుంటున్నాయని తెలిపారు. హైదరాబాద్ ఫార్మా సిటీ భూసేకరణ, అనుమతుల ప్రక్రియ పూర్తవుతుందని త్వరలోనే  కేంద్ర ప్రభుత్వం నుంచి పర్యావరణ అనుమతులు వస్తాయని అధికారులు మంత్రి కేటీ రామారావుకు తెలిపారు.

టీఎస్‌ఐఐసీ చేపట్టిన పలు ఇతర ప్రాజెక్టులు, పార్కుల నిర్మాణ పురోగతి వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.  టిహబ్ -2, ఇమేజ్ టవర్, టీ వర్క్స్ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. టీవర్క్స్ భవనం తాలుకు డిజైన్లను సిద్దం చేయాలని, వచ్చే ఏడాది మే మాసాంతానికి టీ వర్క్స్ పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

 broadband internet for Everyone says KTR

- Advertisement -