మళ్లీ లాక్‌డౌన్ దిశగా!

160
lockdown
- Advertisement -

కరోనా కొత్త స్ట్రెయిన్‌ విలయానికి యుకేలో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. రోజురోజుకి కేసుల సంఖ్య పెరిగిపోతుండటం అందరిని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ వ్యాప్తంగా మళ్లీ లాక్‌డౌన్‌ విధించారు ప్రధాని బోరిస్‌ జాన్సన్‌. ఎవరూ కోవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించొద్దని కోరారు.

లాక్‌డౌన్‌లో భాగంగా.. బుధవారం నుంచి పాఠశాలలు పూర్తిగా బంద్‌ అవుతాయని ప్రకటించారు. లాక్‌డౌన్‌లో భాగంగా కఠిన నిబంధనలు విధించింది ప్రభుత్వం. స్కూళ్లను పూర్తిగా మూసివేయడంతో పాటు వీలైన వారికి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అవకాశం కల్పించారు.

అన్ని దేశాల కంటే ముందే టీకా పంపిణీ ప్రారంభించినా.. కొత్త స్ట్రెయిన్‌ మహమ్మారి కారణంగా బ్రిటన్‌ వ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. నిజానికి గత కొద్దికాలంగా ఇంగ్లండ్‌లో కఠిన ఆంక్షలు విధించారు. అయినప్పటికీ కేసుల సంఖ్య తగ్గలేదు.

- Advertisement -