- Advertisement -
తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండించారు వెస్టిండీస్ మాజీ బ్యాట్స్‌మెన్ బ్రియన్ లారా. తనకు కరోనా పాజిటివ్ అన్న పుకార్లను నమ్మవద్దన్నారు.
కరోనా టెస్టులు చేయించుకున్నానని అందులో నెగటివ్ వచ్చిందని తెలిపిన లారా…ప్రతికూలతను వ్యాప్తిచేయడానికి కరోనా మహమ్మారిని ఒక సాధనంగా ఉపయోగించవద్దని ప్రజలను కోరారు. ఇలాంటి వార్తలతో తనను ఏమాత్రం ప్రభావితం చేయలేరని అన్నారు. కానీ తన చుట్టూ ఉన్నవారిని మాత్రం ఆందోళనకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
కరోనాతో బాధను అనుభవిస్తున్న సమాజంలో ఇలాంటి అసత్య వార్తలను ప్రచారం చేసి, భయాందోళనలను వ్యాప్తిచేయడం మంచిదికాదని సూచించారు.
- Advertisement -