వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆలయాలపై దాడులు..

168
- Advertisement -

నిధుల సమీకరణకు తిరుమల కేంద్రాన్ని బహిరంగంగా ఒక్క టికెట్ కోటి రూపాయలు పెట్టీ విక్రయించడానికి అఖిల భారత శ్రీవైష్ణవ బ్రాహ్మణ సంక్షేమ సంఘం తప్పు పడుతోందనీ జాతీయ ప్రధాన కార్యదర్శి యతిరాజుల బాల బాలాజీ ఘాటుగా విమర్శించారు. ఆదివారం విశాఖ నగరానికి వచ్చిన ఆయన సింహాచలంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తమ సంఘం ప్రభుత్వాలకు వ్యతిరేకం కాదని, కేవలం శ్రీవైష్ణవ దేవాలయాల నిర్వహణకు భంగం కలగడం, ఆగమ సంప్రదాయాలకు లోటు జరిగినా, వైదిక ప్రక్రియలో లోపాలు జరిగినా తప్పని సరిగా స్పందిస్తుందని తెలిపారు.

టీటీడీలో శ్రీ వేంకటేశ్వర స్వామిని సాధారణ భక్తులు సైతం అత్యంత ఆనందంగా దర్శించుకోవాలని అనే సంకల్పంతోనే కృషి చేస్తున్నామన్నారు. ఇటీవలే హిందూ దేవాలయాలను ప్రభుత్వ పరిధి నుంచి విముక్తి కల్గించాలి అంటూ భాగ్యనగరం నుంచి తిరుపతి అలిపిరి వరకూ జరిగిన పాదయాత్రలో సైతం ప్రత్యక్షంగా పాల్గొన్నామన్నారు. ఏ మతం పడితే ఆ మతం వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి టీటీడీ కార్మిక సంస్థ కాదన్నారు. ఇది కేవలం హిందూ ధర్మ సంప్రదాయాన్ని పాటించే ధార్మిక కేంద్రం అన్నారు. అన్యమతస్తులని ఇంకా టీటీడీలో ఎలా కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు.

సెక్యులర్‌గా వుండాల్సిన ప్రభుత్వాలు, పాలకులు ఈ విధంగా హిందూ ధర్మక్షేత్రాలను, ఆలయాలను, మఠాలను, స్వాధీన పర్చుకోవడం వారి వారి ఎజెండాలను అమలు చేసుకొంటూ పాలకుల ఓటు బ్యాంకు రాజకీయాలకు వినియోగించుకోవడం పూర్తిగా చట్ట విరుద్ధం అన్నారు. దేవుని పేరిట భక్తులు హుండీలో వేసే నిధులు, ముడుపులతో సిబ్బంది అధికారులు మేహర్బానీలు చేసుకోవడం క్షమించరాని నేరం అన్నారు. కార్యాలయాలుగా మార్చటం చట్ట విరుద్ధం. ఏ సమస్యలు లేకపోయినా ఆక్రమణాలు చేయడానికే ఆలయాలను ఆక్రమించుకోవటం, ఈవోను నిమయించడం న్యాయవిరుద్ధం.

ఎటువంటి సమస్యలు లేకుపోయిన తిరుమల శ్రీవారి ఆలయంలో, ఇతర దేవాలయాలలో ఐ.ఏ.ఎస్.లు ఇతర ప్రభుత్వ అధికారులు తిష్టవేసుకుని కూర్చుని ఆలయాల సాంప్రదాయలను భ్రష్టు పట్టిస్తూ, అర్చకులపై పెత్తనం చెలాయిస్తూ, దేవదేవుళ్ళను నిలబెట్టి ప్రభుత్వాలు తమ ఎజెండాలకు పెట్టుబడిగా వాడుకుంటున్నాయి. పిల్లల ఆసుపత్రి కట్టడం అనేది ప్రభుత్వ యోచన చాలా మంచిదే. అయితే అందుకు ప్రభుత్వ నిధులు ఖర్చు చేసుకోవాలి గాని ప్రభుత్వ ఎజెండాతో రాజకీయ ఉద్దేశ్యాలతో తిరుమల నిధులను ఇలా మళ్లించడం ఎంతమాత్రము ధర్మసమ్మతము కాదు. ఉదయాస్తమాన ధర్శనాలను భక్తులకు పూర్తి ఉచితంగా ఇవ్వాల్సింది పోయి అందుకోసం రూ.1 కోటీ, కోటిన్నర ధరలు నిర్ణయించడం ఎంతమాత్రము ధర్మసమ్మతం కాదన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత శ్రీ వైష్ణవ బ్రాహ్మణ సంక్షేమ సంఘ సభ్యులు పార్థసారథి, పుడి పెద్ది శర్మ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -