కొమురవెల్లి మల్లన్నకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి హరీష్..

45

కొమురవెల్లిలో వైభవోపేతంగా మల్లికార్జునస్వామి కల్యాణ మహోత్సవం జరుతుంది. ఈ ఉత్సవంలో రాష్ట్ర ఆర్థిక,వైద్య,ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన స్వామి వారి కళ్యాణ మహోత్సవంకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ఆయన సమర్పించారు.

ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, స్థానిక శాసన సభ్యులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, రాష్ట్ర వైద్య సేవలు, మౌళిక సదుపాయ అభివృద్ది సంస్థ చైర్మన్ శ్రీఎర్రోల్ల శ్రీనివాస్,పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.