‘మను’ ట్రైలర్‌ విడుదల

314
manu movie
- Advertisement -

రాజా గౌతమ్‌, చాందిని చౌదరి హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘మను’ ఫణీంద్ర నార్‌శెట్టి దర్శకత్వంలో నిర్వాణా మూవీస్‌ సమర్పణలో నిర్మితమవుతోన్న ఈ మూవీ ట్రైలర్‌ ను ఇవాళ రామానాయుడు స్డూడియోలో విడుదల చేశారు.

manu movie

ఈ సందర్భంగా సినిమా హీరో రాజా గౌతమ్‌ మాట్లాడుతూ ఇది మూడేళ్ల ప్రయాణం. ఈ జర్నీ స్టార్ట్‌ కాకముందు చాలా షార్ట్‌ ఫిలింస్‌ చూశాను. 115 మంది డబ్బులు పెట్టి చేసిన సినిమా కాబట్టి.. ఎంత బాధ్యతగా ఉండాలో తెలిసిన వ్యక్తి. ప్రతి ఒక్కరికీ థాంక్స్‌. హీరోయిన్‌ చాందిని మాతో కలిసిపోయి పనిచేసింది. చాలా ఓపికగా సినిమా కోసం పనిచేసింది. తన కమిట్‌మెంట్‌, డేడికేషన్‌ సూపర్బ్‌. నీల పాత్రలో అద్భుతంగా నటించింది. సెప్టెంబర్‌ 7న సినిమా విడుదలవుతుంది” అన్నారు.

చాందిని చౌదరి మాట్లాడుతూ – ”ఈ క్షణం కోసం నేను ఎంతో వెయిట్‌ చేశాను. ట్రైలర్‌ అందరికీ నచ్చే ఉంటుంది. దీని కంటే ఎన్నో రెట్లు సినిమా గొప్పగా ఉంటుంది. ఫణి, తను చెప్పేదాని కంటే గొప్ప విజన్‌ ఉన్న డైరెక్టర్‌. నాపై నమ్మకంతో ఫణి నాకు అవకాశం ఇచ్చాడు. ఈ సినిమాలో నీలు అనే డెప్త్‌ ఉండే క్యారెక్టర్‌ చేశాను.” అన్నారు.డైరెక్టర్‌ ఫణీంద్ర నార్‌శెట్టి మాట్లాడుతూ – ”ఇది నాకు ఎమోషనల్‌ మూమెంట్‌. కాబట్టి ఇన్వెస్టర్స్‌ను మరచిపోలేను. ఇంత పెద్ద ప్రయాణం ఎక్కడ మొదలైందని చెప్పలేను. ఈ సినిమా కోసం వెయ్యి రూపాయల నుండి నలబై లక్షల వరకు ఇచ్చిన వాళ్లు ఉన్నారు. సినిమాకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌. సినిమా మా వర్క్‌ గురించి ఎక్కువగా చెబుతుందని నమ్ముతున్నాం. ఇంత కంటే బెస్ట్‌ టీమ్‌తో పనిచేయలేనేమోననిపిస్తుంది. ఏడాదిన్నర క్రితమే నిర్వాణ సినిమాస్‌ మమ్మల్ని సంప్రదించారు. వాళ్ల నమ్మకాన్ని సినిమా నిజం చేస్తుందని నమ్ముతున్నాను” అన్నారు.

నిర్వాణ సినిమాస్‌ రాజ్‌ నిహార్‌ మాట్లాడుతూ – ”ఒక సినిమా అందరికీ రీచ్‌ కావాలంటే మంచి కథ కావాలి. అలాంటి కథతో ఫణి చేసిన చిత్రమిది. మంచి సినిమా వచ్చినప్పుడు దాన్ని ప్రేక్షకులకు అందించాల్సిన బాధ్యత డిస్ట్రిబ్యూటర్స్‌గా మాపై ఉందనిపించింది. అందుకే మేము ఈ సినిమాలో భాగమైయాం” అన్నారు.
రాజా గౌతమ్‌, చాందిని చౌదరి, జాన్‌ కొటొలి, మోహన్‌ భగత్‌, అభిరామ్‌, శ్రీకాంత్‌ ముళ్లగరి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: విశ్వనాథ్‌ రెడ్డి, ఆర్ట్‌: శివ్‌కుమార్‌, సౌండ్‌ డిజైన్‌: సచిన్‌ సుధాకరన్‌, హరిహరన్‌, నిర్మాణం: క్రౌడ్‌ ఫండింగ్‌ మూవీ(115 మెంబర్స్‌), రచన, దర్శకత్వం: ఫణీంద్ర నార్‌శెట్టి.

- Advertisement -