తెలంగాణపై కాంగ్రెస్ ది కపట ప్రేమ

204
harishrao

కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణపై కపట ప్రేమని, తెలంగాణను నిండా ముంచిందే కాంగ్రెస్‌ పార్టని రాష్ట్రమంత్రి హరీష్‌ రావు హరీష్‌ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో మంత్రి హరీష్‌ రావు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్‌ మోడల్‌ గా నిలిచిందని అన్నారు. తమ ప్రభుత్వం ఎన్నికల్లో ఇవ్వని హామీలను సైతం అమలు చేస్తున్నామని, రైతు బంధు, రైతు భీమా వంటి పథకాలను తీసుకొచ్చి ప్రజల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తున్నామని మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ పనితీరును చూసి ఇతర రాష్ట్రాలకు చెందిన కొన్ని గ్రామాల ప్రజలు తమ గ్రామాలను సైతం తెలంగాణలో కలపమని డిమాండ్‌ చేస్తున్నారని ఇదే తమ ప్రభుత్వ సుపరిపాలనకు నిదర్శమని అన్నారు మంత్రి హరీష్‌ రావు. నాలుగేళ్లలో తమ ప్రభుత్వం హాయాంలో 14లక్షల కొత్త ఆయకట్టుకు నీళ్లందించామని, కాంగ్రెస్‌ పాలనలో ఏ ఒక్క సమస్యను శాశ్వతంగా పరిష్కరించలేదని మండిపడ్డారు మంత్రి హరీష్‌ రావు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉన్నాయని, ఇతర రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయని, కాంగ్రెస్‌ అంటేనే కరెంటు కోతలు గుర్తుకొచ్చేవని, రైతులకు తమ ప్రభుత్వం 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ ను అందిస్తోందని చెప్పారు మంత్రి హరీష్‌ రావు.