SIR:బాంబే హైకోర్టులో పిటిషన్లు

1
- Advertisement -

భారత ఎన్నికల సంఘం (ECI) చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో తీసుకున్న నిర్ణయాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు తీవ్ర అభ్యంతరాలు తెలిపారంటూ  ఓ జాతీయ పత్రిక దర్యాప్తు కథనం వెల్లడించిన నేపథ్యంలో, మహారాష్ట్రలోని SIR ప్రక్రియను సవాలు చేస్తూ బాంబే హైకోర్టులో గురువారం రెండు రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి.

మహారాష్ట్రలో ఎస్.ఐ.ఆర్ (SIR) ప్రక్రియ ద్వారా ఓటర్ల జాబితా నుంచి తొలగించిన అర్హులైన ప్రతి ఒక్క ఓటరు పేరును తిరిగి పునరుద్ధరించాలని లేదంటే ఈ ఆదేశాలను రద్దు చేసి, ఓటర్ల జాబితా చట్టబద్ధంగా మారేంత వరకు రాబోయే అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని ఈ పిటిషన్లు కోరాయి.

ఎస్.ఐ.ఆర్ ప్రక్రియలో చోటుచేసుకున్న డేటా తొలగింపులు, సాఫ్ట్‌వేర్ బ్లాకేజీలపై పూర్తిస్థాయి విచారణ జరిపేందుకు ఒక స్వతంత్ర సీనియర్ న్యాయమూర్తి నేతృత్వంలోని కమిటీని నియమించాలని పిటిషనర్లు కోరారు.ఎన్నికల సంఘం ఏకపక్షంగా జారీ చేసిన 14 రకాల పరిపాలనా ఉత్తర్వులను రద్దు చేయాలని, అలాగే కమిషనర్లు దాఖలు చేసిన అభ్యంతరాల పత్రాలను కోర్టు ముందు ఉంచాలని అడ్వకేట్ అసిమ్ సరోదే ద్వారా దాఖలైన పిటిషన్‌లో పేర్కొన్నారు.

Also Read:బాలాపూర్ లడ్డూ చరిత్ర…

ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు ప్రక్రియల్లో సాఫ్ట్‌వేర్ ఆధారిత నిర్ణయాల వల్ల తీవ్ర లోపాలు తలెత్తుతున్నాయని, క్షేత్రస్థాయి అధికారుల అధికారాలను కేంద్రీకృత సాఫ్ట్‌వేర్ రద్దు చేస్తోందని మరొక పిటిషన్‌లో ఆందోళన వ్యక్తం చేశారు.ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత కొరవడిందని, సుప్రీంకోర్టు గత తీర్పులకు మరియు ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

- Advertisement -