బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్వహించే కాఫీ విత్ కరణ్ లో షో పాల్గోని.. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా టీంఇండియా యువ క్రికెటర్లు రాహుల్, పాండ్యాలను బీసీసీఐ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇందుకు గాను వీరిద్దరి అత్యవసరంగా ఆస్ట్రేలియా టూర్ నుంచి ఇండియాకు రప్పించారు. మరోవైపు ఈ కేసును బీసీసీఐ చాలా సీరియస్ గా తీసకుంది. ఈ కేసును విచారించేందుకు ప్రత్యేక కమిటీని వేసింది సుప్రీంకోర్టు.
త్వరలో జరిగే మ్యాచ్ లలో కూడా వీరిద్దరి తీసుకోవడం లేదని ప్రకటించింది బీసీసీఐ. హార్దిక్ పాండ్యా చాలా డిప్రెషన్ కు లోనయ్యాడని తెలిపాడు అతని తండ్రి. తాజాగా ఈఘటనపై స్పందించారు ప్రోడ్యూసర్ కరణ్ జోహార్. హార్ధిక్ పాండ్యా, రాహుల్ లను నా షోకు నేనే ఆహ్వానించాను. ఈ కార్యక్రమానికి సంబంధించిన బాధ్యతలు తానే వ్యవహారించాలి.
ఈ ఘటన జరిగిన తర్వాత తాను ఎన్నో రాత్రులు నిద్రలేకుండా గడిపాను అని చెప్పారు. నా వల్ల వారిద్దరికి తీరని అన్యాయం జరిగిందని చెప్పారు. ఇప్పుడు పరిస్థితి చేయి దాటి పోయింది. నేను చెప్పే మాటను ఎవరు వింటారు? నన్ను క్షమించండి’ అంటూ ట్వీట్ చేశారు.