క‌పిల్ దేవ్ బ‌యోపిక్ విడుద‌ల తేది ఖరారు..

223
- Advertisement -

బాలీవుడ్‌లో గత కొద్దికాలంగా క్రీడా నేపథ్యంలో పలు సినిమాలు వచ్చిన విషయం తెల్సిందే. తాజాగా ఇదే నేపథ్యంలో మరో మూవీ తెరకెక్కనుంది. రణ్ వీర్ సింగ్ హీరోగా ’83’ అనే క్రికెట్ నేపథ్యం చిత్రం రాబోతుంది. 1983వ సంవత్సరంలో కపిల్ దేవ్ సారథ్యంలో ఇండియా ప్రపంచ కప్ గెలుచుకున్న విషయం తెల్సిందే. ఆ నేపథ్యంలో సినిమాను చిత్రీకరించబోతున్నారు. కపిల్ దేవ్ పాత్రను రణ్ వీర్ సింగ్ పోషిస్తుండగా ఈ చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహించబోతున్నాడు.

Ranveer Singh

హిందీ, తెలుగుతో పాటు పలు భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఈ చిత్రంలో రణ్ వీర్ సింగ్‌కి కోచ్‌గా నటించనున్నారు. తాజాగా చిత్రానికి సంబంధించిన ఓ వీడియో ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేస్తూ అతి త్వ‌ర‌లో చిత్రానికి సంబంధించిన భారీ కాస్టింగ్ ప్ర‌క‌టించ‌నున్నామ‌ని తెలిపారు. 2020లో ఏప్రిల్ 10 గుడ్ ఫ్రైడే రోజు క‌పిల్ దేవ్ బ‌యోపిక్ చిత్రంని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు కూడా తెలిపారు. ఈ చిత్రాన్ని రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించ‌నుంది.

- Advertisement -