సోషల్ మీడియాలో సుశాంత్ వీడియో..ఫైర్ అయిన దీపికా

308
deepika
- Advertisement -

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ ఆత్మహత్య చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే సుశాంత్ ఆత్మహత్య తర్వాత నెపోటిజం అనే పదం బాలీవుడ్ లో చర్చాంశనీయంగా మారింది. కొంత మంది ఒత్తిడివల్లే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడని పలువురు కామెంట్లు చేస్తున్నారు. కొంత మంది ఒత్తిడి వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని పలువురు సెలబ్రెటీలు బహిరంగంగానే కామెంట్లు చేశారు.

ఇక సుశాంత్ మరణం అనంతరం ఆయన మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి శ్మశాన వాటిక వరకు తీసుకెళ్తున్న దృష్యాలను వీడియో ద్వారా చిత్రికరించాడు. అనంతరం ఆవీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.తాజాగా ఈ వీడియో చూసింది హీరోయిన్ దీపిక పడుకొనే. అనంతరం ఆ ఫోటోగ్రఫర్ ను ఉద్దేశించి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అసలు ఈవీడియో తీయడం ఎంత వరకు కరెక్ట్..సుశాంత్ వాళ్ల తల్లి తండ్రుల అనుమతి లేకుండా వీడియో ఎలా తీస్తారు. చనిపోయిన వాళ్ల వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇలా డబ్బులు సంపాదించడం ఎంటి అని ప్రశ్నించింది. దీపిక చేసిన పోస్ట్ కు పలువురు నెటిజన్లు సమర్ధిస్తున్నారు.

- Advertisement -