హిందీ తెర పై అమితాబ్ బచ్చన్ తిరుగులేని ఓ చిరకాల కథానాయకుడు. ఆ మధ్య సైరా సినిమాలో అమితాబ్ ఓ అతిధి పాత్ర చేశారని… యావత్తు సౌత్ సినీ లోకం గొప్పగా చెప్పుకుంది. అలాంటిది ఇప్పుడు సౌత్ సినిమాలకు అమితాబ్ మరింత దగ్గర అయిపోయారు. అవును, సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు ఎవరితో ఎలాంటి పాత్ర చేయిస్తోదో తెలియదు. కథ ఎప్పుడూ గొప్పదే. దేవుడిగా కొలవబడ్డ సీనియర్ ఎన్టీఆర్ చేత.. రాక్షసుడు పాత్ర వేయించింది. మాట పడని ఆత్మాభిమానం ఉన్న ఏఎన్నార్ చేత పచ్చి తాగుబోతు, దొంగ పాత్రలు చేయించింది.
అందుకే.. సినిమా అనేది రంగుల మయం మాత్రమే కాదు, మాయాలోకం కూడా. ఒకటి రెండేళ్ల క్రితం అనుకుంటా.. అమితాబ్ విషయంలో అందరూ బాధ పడ్డారు. అయ్యో..బిగ్ బి అనారోగ్యం పాలయ్యారు, ఇక ఆయనను వెండితెర పై చూడలేం అని చింతించారు. కట్ చేస్తే ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. దక్షిణాదిన బలమైన పాత్ర ఉంటే.. సౌత్ ఫిల్మ్ మేకర్స్ అందరూ అమితాబ్ కేసే చూస్తున్నారు.
ప్రభాస్ ప్రాజెక్ట్ కే లో ఆల్ రెడీ అమితాబ్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అలాగే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహేష్ బాబు సినిమాలో కూడా అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారట. అలాగే ప్రభాస్-మారుతి సినిమాలో ప్రభాస్ కు తాతగా అమితాబ్ కనిపించబోతున్నారని టాక్ నడుస్తోంది. కొరటాల శివ – ఎన్టీఆర్ సినిమాలో కూడా అమితాబ్ ఉండే ఛాన్స్ ఉందట. మొత్తానికి సౌత్ లో ఇవి కాక మరో తమిళ సినిమాలో కూడా అమితాబ్ వుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి అమితాబ్ ఇప్పుడు సౌత్ నటుడు అయిపోయారు.
ఇవి కూడా చదవండి…