మరో సినీ ప్రేమ జంట పెళ్లి పిటలెక్కబోతున్నారు. ఇటివలే అనుష్క శర్మ, ఇండియా క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక టాలీవుడ్ లో నాగచైతన్య, సమంతలు కూడా పెళ్లి చేసుకున్నారు. ఇక బాలీవుడ్ లో మరో ప్రేమ జంట కూడా పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ ప్రేమ జంట రణ్ వీర్ సింగ్, దీపికా పదుకోన్ లు పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారని టాక్ వినిపిస్తోంది.
ఇటివలే పెళ్లి డేట్ ను కూడా ఫిక్స్ చేసుకున్నట్లు వార్తలు వస్తోన్నాయి. ప్రముఖ మ్యాగజైన్ ఫిల్మ్ ఫేర్ తెలిపిన వివరాల ప్రకారం నవంబర్ 10వ తేదిన వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. గతంలో వీరి పెళ్లిపై చాలా తేదీలు ఖరారు చేసిన వారు పెళ్లి చేసుకోలేదు. ఈసారి మాత్రం పక్కా గా చేసుకుంటారని బీ టౌన్ లో చర్చ నడుస్తోంది. వీరి పెళ్లిని చాలా గ్రాండ్ గా చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇరువురి కుటుంబ సభ్యులు. పంజాబీ సాంప్రదాయం ప్రకారం ఇరువురి కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గోనే రోకా సెర్మనీ జరిగిపోయింది .
అంతేకాదు పెళ్లి తర్వాత తాము కలిసి ఉండబోయే ఇంటిని కూడా వీళ్లు ఇప్పటికే ఫైనలైజ్ చేశారు. ఈ విషయంలో దీపికా పదుకునే ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. చేతిలో వున్న సినిమాలను సాధ్యమైనంత వరకు త్వరగా పూర్తి చేసి.. వివాహానికి సిద్ధం కావాలని దీపిక, రణవీర్ సింగ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్ వంటి చారిత్రాత్మక చిత్రాల్లో కలిసి నటించిన సంగతి తెలిసిందే.